ఇండియానాపోలిస్ తెలుగు వారు స్థానిక ఫెయిర్ గ్రౌండ్స్ లో గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ 'గీత' ఆధ్వర్యములో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బముగా నిర్వహకు వివిధ సాంస్కృతిక కార్యకమాలు నిర్వహించినారు. అనిల, సుష్మ యార్లగాడ్దల భారత నాట్యం, డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ శ్రీకృష్ణ ఎకపాత్రభినయం, చిన్న పిల్లల నృత్యాలు అతిధులను అలరించినాయి. బక్తిశ్రద్దలతో విచ్చేసిన తెలుగు ఆడపడచులు తాము తెచ్చుకున్న బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని 'గీత' అధ్యక్షుడు అజయ్ పొనుగోటి, రాము చింతల, వినోద్ సాదు, శేఖర్ క్రిష్ణమనేని, శ్రవన్ పాతర్ల, అమరేస్వర్ లింగాల, శాంతశ్రీ తలకాల పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి రాజు చింతల, సత్యనారాయణ రెడ్డి మర్రి మరియు ఇతర స్థానిక ప్రముఖులు హాజరై నిర్వాహకులను అభినందించారు.