Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బే ఏరియాలో బతుకమ్మ

Bathukamma Festival
అమెరికాలోని బే ఏరియాలో తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దాదాపు వేయి మంది ఆనందోత్సహాల మధ్య బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. తెలంగా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పండుగ సైదీష్ అజ్జన్ పర్యవేక్షణలో జరిగింది. మెగా బతుకమ్మ ఫెస్టివల్ 2010 పేర దీన్ని తెలంగాణ ఎన్నారైలు నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. విశాలమైన పార్కు బతుకమ్మలతో, మహిళల చీరలతో రాగరంజితంగా మారింది. సన్నివాలె సిటీ వైస్ మేయర్ క్రిస్టఫర్ మోయ్లాన్ పూలతో ఈ కార్యక్రమానికి వచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

మహిళలు పూజలు చేస్తుండగా మృత్యుంజయుడు గౌరీపూజ చేశారు. మహిళల బతుకమ్మ ఆటను భాస్కర్ మద్ది నిర్వహించారు. ప్రముఖ రేడియో ఆర్టిస్టు మనాప్రగడ నరసింహమూర్తి భార్య రేణుకా దేవి అమెరికాలో బతుకమ్మ పాటను పాడారు. ఆమెకు పలువురు కోరస్ అందించారు. బతుకమ్మ ఆడుతూ మహిళలు తెలంగాణ జానపద గేయాలు ఆలపించారు. యాసాల బాలయ్య చిత్రాల పుస్తకాన్ని స్థానిక తెలుగు సంఘాలు సిలికానాంధ్ర, బాటా ఆవిష్కరించాయి. టిసిఎ చైర్మన్ విజయ్ చవ్వా, బాటా అధ్యక్షుడు శ్రీలు వెలిగేటి, సిలికానంధ్ర ప్రతినిధి ఆనంద్ కూచిభొట్ల, విజయ్ ఆసూరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

బతుకమ్మ పండుగ ఏర్పాట్లను బిక్షం పాలబిందెల, బుచ్చన్న గాజుల చేశారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు, ఉత్తర భారతదేశానికి చెందినవారు బతుకమ్మ పండుగ గురించి అడిగి తెలుసుకున్నారు. అమెరికా యువకుడు ఇవాన్ పోంటిక్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఈ కార్యక్రమానికి వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సన్నిధి రెస్టారెంట్, భారత్ మూవర్స్ లకు రాజు యాసాల కృతజ్ఞతలు తెలిపారు. అర్షద్ హుస్సేన్, భాస్కర్ బండిక్కాలు, చక్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+