చికాగోలో బతుకమ్మ పండుగ

ఈ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు క్రీడాపోటీలు నిర్వహించి, బహుమతి ప్రదానం చేశారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. నృత్యాలు, గేయాలాపనలు రెండు గంటలకు పైగా సాగాయి. ఆ తర్వాత బతుకమ్మలను పక్కనే గల సరస్సులో నిమజ్జనం చేశారు. ఉత్తమ బతుకమ్మకు మెమెంటో అందజేశారు.
చికాగో తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమాలను, దాని ఉద్దేశ్యాలను కొందరు వక్తలు వివరించారు. తెలంగాణ విమోచన దినం గురించి కూడా వక్తలు ప్రసంగించారు. తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం గురించి ప్రముఖ రచయిత బిఎస్ రాములు వివరించారు. కృష్ణ రంగరాజు, అశోక్ లక్ష్మణన్ వంటి వారు ఈ కార్యక్రమ నిర్వహణలో తమ వంతుగా సహకరించారు.












Click it and Unblock the Notifications