వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగో తెలుగు సంఘం వార్షికోత్సవం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
బ్లూమింగ్ డేల్: చికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఎ) ప్రథమ వార్షికోత్సవం ఫిబ్రవరి 29న ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. చికాగోలోని ఇయోల కమ్యూనిటి సెంటర్ లో నిర్వహించిన సిటిఎ వేడుకలకు చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం రాయబారి విశ్వాస్ సప్కాల్ ముఖ్యఅతిథిగా, ఇండియన్ కాన్సులేట్ లో రాయబారి సురేష్ మీనన్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరయ్యారు. సిటిఎ సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ కాన్సులేట్ జనరల్ అశోక్ కుమార్ అత్రి శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. సిటిఎ వార్షికోత్సవం సందర్భంగానే సంస్థ 2010 నూతన కార్యనిర్వాహకవర్గ కమిటీని ప్రకటించారు.

ఈ సందర్భంగా విశ్వాస్ సప్కాల్ మాట్లాడుతూ, 2009వ సంవత్సరంలో సిటిఎ నిర్వహించిన సమాజ సేవా కార్యక్రమాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. సిటిఎ సంస్థకు, సభ్యుల సేవలను ఆయన కొనియాడారు. చికాగో చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగువారెవరికి ఎప్పుడు, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సిటిఎ సంస్థ సహాయం అందించేందుకు ముందుంటున్నదని అభినందించారు. తెలుగువారికి విశేష సేవలందిస్తున్న సిటిఎ సంస్థకు చికాగో ఇండియన్ కాన్సులేట్ నుంచి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చికాగో ప్రాంతంలో ఉన్న తెలుగువారికి సేవలు అందించేందుకు ప్రవాసాంధ్ర యువత ముందుకు రావడం ముదావహం అన్నారు. సిటిఎకు భవిష్యత్తులో కూడా ఇండియన్ కాన్సులేట్ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సిటిఎ కొత్త కార్యవర్గం ఏర్పాటైనందున ఇంతవరకూ పదవిలో ఉన్న కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా విశ్వాస్ సప్కాల్ మొమెంటోలు అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X