తానా, ట్యాంటెక్స్ గానలహరి సూపర్ హిట్

NRI
డల్లాస్‌: తానా, ట్యాంటెక్స్ ల గానలహరి ఘనంగా జరిగింది. తానా(తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), టాన్‌ట్యాక్స్‌( తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌)లు సంయుక్తంగా 'నవతరం స్వరమాధురి' అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఎల్‌.డి. బెల్‌ హైస్కూల్‌లో ఈ గానలహరి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులకు, ప్రసాంధ్రులకు సంస్థ ప్రాంతీయ డైరక్టర్‌ మురళి వెన్నెం ఘన స్వాగతం పలికారు. సంగీత దర్శకులు జి. ఆనంద్‌, గాయకులు ప్రణవి, అంజన స్వామి, మా సూపర్‌సింగ్‌ విజేత దీపు, మరో విజేత రవి, జీ సరిగమప రన్నర్‌ భువనకృతులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా తానా ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ..సంగీత దర్శకులు ఆనంద్‌ వివిధ దేశాల్లో సుమారు ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారని, కొత్త కళాకారులను ప్రోత్సహించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఆయన అన్నారు. నవతరం స్వరమాధురి పాటల పోటీ విజేతగా విక్రమ్‌ గండికోట, రన్నర్‌గా గోపినాథ్‌లు నిలిచారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు 'ఆపరేషన్‌ ఎన్‌విజన్‌'కు సంబంధించిన పలు వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

ఈ ప్రోగ్రాంన్ని మరిన్ని ప్రాంతాలను విస్తరించేలా వాలంటీర్లు, స్పోన్సర్లు సహకరించాలని దిలీప్‌ కూచిపూడి కోరారు. ఈ కార్యక్రమంలో తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ప్రసాద్‌ తోటకూర, రామ్‌ యలమంచలి, మురళి వెన్నెం, దిలీప్‌ కూచిపూడి, టాన్‌ట్యాక్స్‌ టీం సభ్యులు చంద్ర కన్నెగంటి, ఎన్‌.ఎమ్‌.ఎస్‌. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ తానా, టాన్‌ట్యాక్స్‌లు కృతజ్ఞతలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+