అమెరికాలో కవితకు సత్కారం

తెలంగాణ సాధన కోసం తాము అనుసరిస్తున్న వ్యూహంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ కృష్ణ సాగర్ రావు అన్నారు. ప్రత్యర్థులు కొద్ది మందే అయినా, రాజకీయ, ఆర్థిక బలం పుష్టింగా ఉన్నవారని, వారికి లాబీయింగ్ శక్తి విపరీతంగా ఉందని ఆయన అన్నారు. గత 60 ఏళ్ల ఉద్యమం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుందని ఆయన చెప్పారు.
భరత్ మదాడి డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ కార్యక్రమాల గురించి వివరించారు. కల్వకుంట్ల కవితను వెంకట్ మంతెన పరిచయం చేశారు. ఆ తర్వాత పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని కవిత చెప్పారు. ఆ తర్వాత డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ వాలంటీర్లు కవితను సత్కరించారు. సువర్ణ, నాగేందర్ అయితా యాంకర్లుగా వ్యవహరించారు. మురళి బొమ్మనవేణి, రాం రెడ్డి, సునీల్ మర్రి, రామ్‌గోపాల్ ఉప్పల, రాజు బ్రహ్మానందబేరి కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడ్డారు.












Click it and Unblock the Notifications