జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎన్నారైల హర్షం

YS Jagan
డాక్టర్ వైఎస్సార్ పేరుని సిబీఐ రిపోర్ట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఎమెల్యేలు, ఎంపీ చేసిన రాజీనామాల్ని ఎన్నారైలు హర్షించించారు. ఈ విషయాన్ని అమెరికాలోని అట్లాంట నుండి గురవా రెడ్డి ఒక ప్రకటన రూపంలో తెలియజేసారు. రాజీనామా చేసిన ప్రతి ఒక్క ఎమెల్యేను, ఎంపీని రాష్త్ర ప్రజానీకం గెలిపించుంటుందని ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేసారు. వైఎస్సార్ గోరుముద్దలు తినిపించి పెంచిన మిగిలిన ప్రజాప్రతినిధులు కూదా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసారు. వైఎస్సార్ పెట్టిన బిక్షే అధికారం అని సొనియా గాంధీని, కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్స్ పార్టీనుద్దేశించి అన్నారు. అన్నం పెట్టిన చేతినే నరికేసే వారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

వైఎస్ జగన్మొహన్ రెడ్డి మీద జరుగుతున్న నేటి సిబిఐ ధర్యాప్తు కాంగ్రెసు, టిడీపిలు కలిసి ఆడుతున్న ఒక కుటిల రాజకీయ క్రీనీడ మాత్రమే అని వారన్నారు. ఎప్పుడైతె జగన్మొహన్ రెడ్డి కాంగ్రెసును వదిలి, కడపలో ఘనమైన, మహత్థరమైన, చారిత్రాత్మికమైన విజయాన్ని సాధించాడో కాంగ్రెస్, టిడీపీలు, కొంతమంది మీడీయా పెద్దలు జగన్ని రాజకీయంగా ఎదుర్కొనలేమనె నిర్ణయానికొచ్చి, భారత దేశంలొనె మొట్టమొదటి సారిగా అధికారంలొ లేని ఒక వ్యక్తి పైకి అన్ని ధర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న కుట్రపూరిత, మోసపూరిత ఎత్తుగడ ఇది అని వారన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లకున్న ప్రజాబలాన్ని చూసి ఓర్చుకొలేక అడ్డమైన దారులు తొక్కుతున్న ఈ పార్టీలని, ఈ మీడియా పెద్దల్ని నిలువరించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని వారన్నారు. ఒక వ్యక్తిపైనే కాకుండా, గడచిన 25 సంవత్సారాల్లో అధికారం చెలాయించిన మంత్రులందరి మీదా ధర్యాప్తు చేయాలని కోరారు.

ఈ కింది ఎన్నారైలు ప్రకటనపై సంతకాలు చేశారు -

- అట్లాంట నుండి గోపినాథ్ రెడ్డి, వెంకట్ మొండెద్దు, రవి సింగారెడ్డి, కిరణ్ కందుల, శ్రీనివాస్ కొట్లూర్, వెంకట్రామి రెడ్డి, రాజ్ కాసిరెడ్డి, రవి కాకులవరం, డాక్టర్ గిరి, వెంకట్ మదన, కృష్ణమోహన్ తదితరులు

- న్యూజెర్సీ నుండి రామి రెడ్డి, శ్రీని ఆరికట్ల, సురేష్ రెడ్డి, రాజేష్ గంగసాని, డాక్టర్ రాఘవ రెడ్డి, బసివి రెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, ప్రభాకర్ రెడ్డి తదితరులు

- డెట్రాయిట్ మిషిగన్ నుండి లింగాల హరిప్రసాద్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, కుకునూర్ వినోద్, భూమిరెడ్డి యుగంధర్, యార్లగడ్డ శివరాం, కొనుగంటి రమణరెడ్డి, ఆత్మకూరు వినోద్, గుణశేఖర్ రెడ్డి తదితరులు

- ఫ్లోరిడా నుండి డాక్టర్ వాసుదేవ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ తాల్ల, రఘు పాడి, డాక్టర్ సతీష్ కేసవ, డాక్టర్ బాలి రెడ్డి, రామచంద్ర ఆకవరం, డేనియల్ అడిపి తదితరులు

- సెయింట్ లూయిస్ నుండి సుబ్బా రెడ్డి పమ్మి, గోపాల్ రెడ్డీ తాటిపర్తి, కిరణ్ ములుపూరు, సాయికృష్ణ, దినేష్ బత్తుల, చనూ తారపరెడ్డి, నంద ముటాల, నరసిమ్హా కొండా తదితరులు

- బ్లూమింగ్డేల్ నుండి లింగా రెడ్డి గున్నపనేని, సుధీర్ కంచి, రఘుకరెడ్డి తదితరులు

- రిచ్మండ్ వర్జీనియా నుండి విశ్వనాథ కిచ్చిలి, నరసింహ రనబోతు, వెంకట్ కుందవరం, శేఖర్ రెడ్డి, రణధీర్ కాలవ తదితరులు

- వర్జీనియా/వాషింగ్టన్ నుండి భువనేష్ బూజాల, రమేష్ వల్లూరు, వెంకట్ కొండపోలు, రాజీవ్ రాజోలు తదితరులు

- లాస్ ఏంజెల్స్ నుండి వీరా రెడ్డి నంద్యాల, రాజశేఖర్ కెసిరెడ్డి, శ్రీకాంత్ మండిపాటి, శివా వంగ, మధు కోలి, సందీప్ రెడ్డి తదితరులు

- బే ఏరియా నుండి గోపి, రాఘవ యంగాల, మధు వంగా, సురేష్ వుయ్యూరు తదితరులు

- టెక్సాస్ నుండి నారాయణ రెడ్డి, రంగేష్ కోన. శ్రీనివాస్ గుర్రం, మధు గూల్ల తదితరులు

- డెమోయిన్ ఐయోవా నుండి అమర్నాథ్ రెడ్డి తరిమెల, నిరంజన్ బోల్ల, యాదవ రెడ్డి తదితరులు

- ఆస్ట్రేలియా నుండి రమణా రెడ్డి తదితరులు

- ఐర్లాండ్ నుండి జగన్నాధ రెడ్డి ముట్టుముల, శ్రీనివాస్ తెరా, రాజగోపాల్ తెరా, దీప జానెపల్లి, శ్రీధర్, సూరి, విజయేందర్ రెడ్డి, జయంత్ రెడ్డి మెట్టు తదితరులు

- ఇంగ్లాండ్ నుండి అబ్బయ్య చౌదరి, శ్రీనివాస్, జంగయ్య, జొసెఫ్, మహమద్ సమి తదితరులు

- మిడ్డిల్ ఈస్ట్ నుండి మహమ్మద్ అజర్, మహమ్మద్ నజీర్, మహమ్మద్ కరీం, మహమ్మద్ అజీజ్, షైక్ అక్తర్, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్, రాజేష్ రెడ్డి తదితరులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+