అమెరికాలోని సన్నివాలే, సిఎకు చెందిన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఈ నెల 30వ తేదీన ఈ ఉత్సవాలను సంఘం నిర్వహించుకుంటోంది. భారతదేశ వ్యాప్తంగా 62వ గణతంత్ర దినోత్సవాలు ఈ నెల 26వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా టిసిఎ 30వ తేదీన పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు జనవరి 30వ తేదీ ఆదివారం అతిథి ఇండియన్ కుషిన్‌లో సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు జరుగుతాయి. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి గలవారు http://telanganaculture.org/evnt_Registration.phpకు సంప్రదించవచ్చు.