అమెరికాలో పిల్లలకు వాలీబాల్ క్లినిక్
డల్లాస్: పిల్లల్లో క్రీడలు, ఆటల పట్ల ఆసక్తి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికాలోని తెలుగు పిల్లలు ఎక్కువగా ఎక్స్‌బాక్స్, పిఎస్, మొబైల్ వంటి వర్చ్యువల్ గేమ్స్ ఆడుతూ కాలం వెల్లబుచ్చుతున్నారు. ఈ వాతావరణాన్ని గమనించి టాంటెక్స్ పిల్లలకు క్రీడల ఆసక్తిని పెంచి, వాటిలో వారిని ప్రోత్సహించేందుకు నడం కట్టింది. క్రీడల పట్ల వారికి అవగాహన కలిగిస్తూ వారిలో క్రీడాసక్తిని పెంపొందించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
అందులో భాగంగా టాంటెక్స్ డిసెంబర్ 22వ తేదీన పిల్లలకు డల్లాస్‌లో వాలీబాల్ క్లినిక్ నిర్వహించింది. దీనికి 15 మందికిపైగా పిల్లలు హాజరయ్యారు. టాంటెక్స్ - 2012 అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఉర్మిడి క్లినిక్‌ను ప్రారంభించారు. దేహం, బుద్ధి వికసించడానికి భాష, సంస్కృతులు మాత్రమే కాకుండా క్రీడలు కూడా ఇతోధికంగా తోడ్పడుతాయని ఆయన అన్నారు.

అమెరికాలో భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించే సంస్థల్లో టాంటెక్స్ ఒకటి అని, దాంతో పాటు ఏడాది పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. టాంటెక్స్ కోశాధికారి కృష్ణారెడ్డి ఉప్పలపాటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శిక్షణాశిబిరాన్ని టాంటెక్స్ యూత్, స్పోర్ట్స్ చైర్ బల్కి చంకుర నిర్వహించారు. పిల్లల రిక్రియేషనల్ లీగ్స్‌కు ఆయన కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రియా మద్ది, వెన్నెల వట్టికుట్టి, రోనౌక్ ఇందుర్తి, కార్తిక్ చెన్నుపాటి, సంజన పూనూరు, కీర్తి చంకుర, ప్రియా కొండా, రుత్విక్ కెల్లా, రుతికా కెల్లా, రాహుల్ వెంటి, వైభవ్ గడ్డం, ప్రణవ్ కస్తూరి, జయదేవ్, అమిత్ ఆశవ, విజయ చారు తదితర పిల్లలు ఈ శిబిరంలో పాల్గొన్నారు.
బల్కి చంకురకు పిల్లల తల్లిదండ్రులు ఆనంద్ ఆశవ, కమలాకర్ పూనురు, రాంబాబు చెన్నుపాటి, సతీష్ పున్నం, సునీతా మిటికంటి, ఝాన్సీ చంకుర సహాయసహకారాలు అందించారు. వాలీబాల్ బేసిక్స్, పాసింగ్, సర్వింగ్ వంటివాటితో శిబిరం ప్రారంభమైంది. పిల్లలకు వాలీబాల్ నిబంధనలను వివరించారు. ఆ తర్వాత పిల్లలను రెండు జట్లుగా వేరు చేశారు. ఇరు జట్ల మధ్య పోటీ నిర్వహించారు. పిల్లలు ఎంతో ఆనందించారు.
వాలీబాల్ శిక్షణా శిబిరానికి లభించిన ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని టాంటెక్స్ భవిష్యత్తులో చెస్, గోల్ఫ్ క్రీడల్లో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications