వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిట్టా చేరిక తెలంగాణకు మేలు: ఎన్నారైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jitta Balakrishna Reddy
వైయస్ జగన్ ద్వారానే తెలంగాణ సాధ్యం లేదా తెలంగాణకు న్యాయం అనే లక్ష్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో యువ తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి చేరిక ద్వారా తెలిసిపోతోందని అమెరికాలోని వైయస్సార్ యువసేన నాయకులు అన్నారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడాన్ని ఆహ్వానిస్తున్నట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు.

వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి, యువసేన అమెరికా కమిటీ గౌరవ సలహాదారు మునగాల బ్రహ్మానంద రెడ్డి, అమెరికా కమిటీ మిస్సోరీ ఇంచార్జీ పమ్మి సుబ్బారెడ్డి, సెయింట్ లూయిస్ ఇంచార్జీ శ్రీనివాస రెడ్డి, యువసేన అమెరికా కమిటీ మీడియా సమన్వయకర్త పాల భానోజీ, యువసనే అమెరికా కమిటీ ఇల్లినోయిస్ ఇంచార్జీ వంగాల శ్రీనివాస రెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమతి యువజన విభాగం అధ్యక్షుడిగా, యువ తెలంగాణ కన్వీనర్‌గా జిట్టా బాలకృష్ణా రెడ్డి సాధించిన అనుభవం తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తరణకు తోడ్పతుండని వారు భావించారు. వైయస్ జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం స్థాపన కోసం తెలంగాణ ప్రజలు, తెలంగాణవాదులు కోరుతున్నట్లు కూడా జిట్టా బాలకృష్ణా రెడ్డి చేరిక ద్వారా అర్థమవుతోందని వారు అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల తెలంగాణలో ఉన్న అభిమానం కూడా తెలిసిపోతోందని అన్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు గెలుస్తుందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు.

జిట్టా బాలకృష్ణా రెడ్డితో తాము ఫోన్‌లో మాట్లాడి, అభినందనలు తెలిపినట్లు వారు చెప్పారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి పోరాట పటిమ 2009 ఎన్నికల్లోనే రుజువైందని, మహాకూటమి అభ్యర్థి ఉమా మాధవరెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 43,720 ఓట్లు తెచ్చుకున్నారని వారు గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ మూడో స్థానంలోకి వెళ్లగా, ప్రజారాజ్యం పార్టీ డిపాజిట్ కోల్పోయిందని వారు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జిట్టా బాలకృష్ణా రెడ్డిని తేవడంలో చొరవ చూపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కెకె మహేందర్ రెడ్డిని తాము ఫోన్‌లో అభినందించినట్లు వారు తెలిపారు. షర్మిల పాదయాత్ర విజయవంతం నడుస్తుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

English summary

 Yuva Telganam Party founder & President Jitta Balakrishna Reddy Joining into YSR Congress Party would strengthen the party in Nalgonda district and also whole Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X