NRI News: హిందీలో వీడియో కాల్ మాట్లాడినందుకు ఉద్యోగం పోయింది..

హిందీలో వీడియో కాల్ మాట్లాడినందకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఓ భారతీయ-అమెరికన్ ఇంజనీర్ ఆరోపించారు. దీనిపై అతను కంపెనీకి వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు చెప్పారు. అనిల్ వర్ష్నీ అనే 78 ఏళ్ల వ్యక్తి పార్సన్స్ కార్పొరేషన్ సంస్థలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2011 నుంచి 2022 వరకు ఆ సంస్థలో ఉద్యోగం చేశాడు. పార్సన్స్ సంస్థ రక్షణ, నిఘా, భద్రతాపరమైన విభాగాల్లో సేవలు అందిస్తోంది.

గత ఏడాది అనిల్ వర్ష్నీ కార్యాలయంలో ఉన్న సమయంలో రెండు నిమిషాల పాటు భారత్‌లోని తన బంధువుతో హిందీలో వీడియో కాల్ మాట్లాడారు. వీడియో కాల్‌లో హిందీ మాట్లాడటం విన్న తర్వాత క్షిపణి రక్షణ కాంట్రాక్టర్ అలబామా కార్యాలయంలో ఉన్న అతన్ని విధుల నుంచి తొలగించింది. భద్రతపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతోపాటు అనిల్ వర్ష్నీ ఇతర కంపెనీల్లో కూడా పని చేయకుండా చర్యలు తీసుకున్నారు.

jobfired

కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తు అనిల్ వర్ష్నీ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జె. ఆస్టిన్‌పై అలబామా ఉత్తర జిల్లాలో పౌర హక్కుల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. "మిస్టర్ వర్ష్నే అత్యంత విశిష్టమైన ఇంజనీరింగ్ వృత్తిని ముగించడానికి ప్రతివాదులు ఉద్దేశపూర్వక చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే అతను 78 ఏళ్ల భారతీయ అమెరికన్.భారత్ ఉన్న మరణిస్తున్న తన బావమరిదితో హిందీలో మాట్లాడుతుండగా.. అతని శ్వేతజాతి సహోద్యోగి ఒకరు విన్నారు. 'సెక్యూరిటీ నిబంధనలను' ఉల్లంఘించినందుకు తప్పుగా నివేదించిన తర్వాత ప్రతివాదులు Mr. వర్ష్నీని హఠాత్తుగా తొలగించారు" అని అనిల్ వర్ష్నీ తరుఫు న్యాయవాది వాదించారు.

వర్జీనియాకు చెందిన డిఫెన్స్ కాంట్రాక్టర్‌ తరుపు వాదించిన న్యాయవాది షారన్ ఎల్. మిల్లర్ పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. వ్యాఖ్యను అభ్యర్థిస్తూ వచ్చిన ఫోన్ సందేశం ఇమెయిల్‌కు అనిల్ వర్ష్నీ వెంటనే స్పందించలేదన్నారు. దావాను కొట్టివేయాలని కోరారు. జులై 2011 నుంచి అక్టోబరు 2022 వరకు పార్సన్స్ హంట్స్‌విల్లే కార్యాలయంలో పనిచేసిన వర్ష్నీ ఖాళీ క్యూబికల్‌లో ఉన్న తన బావ నుండి వీడియో కాల్‌ని అంగీకరించి అతనితో సుమారు రెండు నిమిషాలు మాట్లాడాడని చెప్పారు. తద్వారా అతను భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+