NRI News: ఆటా ఆధ్వర్యంలో కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..

అమెరికా తెలుగు సంఘం ఆటా(ATA) ఆధ్వర్యంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. అధ్యక్షులు బొమ్మినేని మధు , కాన్ఫరెన్స్ కన్వీనర్ పాశం కిరణ్ నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు.

12 నగరాలలో టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పాజంట్ పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా ఫైనల్ విజేతలకు క్రౌన్ ప్రజంటేషన్ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. బ్యూటీ పాజంట్ పోటీలను అమెరికాలోని అట్లాంటా, ర్యాలీ, షార్లెట్, డల్లాస్, ఆస్టిన్, న్యూ జెర్సీ, లాస్ ఏంజలెస్, చికాగో, ఓర్లాండో, వాషింగ్టన్ డీసీ, నాష్విల్, డెట్రాయిట్ నగరాల్లో నిర్వహించనున్నారు.

A Convention amp amp Youth Conference will be organized under the auspices of Ata

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్, ఫీజు, నిబంధనలు తదితర వివరాలకు www.NRI2NRI.com/ATA Beauty Pageant 2024 ని సందర్శించాలని నిర్వహకులు కోరారు. ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలకు శ్రావణి రాచకుల్ల ఛైర్ పర్సన్ గా నలల్గా నీహారిక, అడ్వైజర్ గా ఆయల గాయత్రి, గొల్ల అనూజ గొల్ల ఉండనున్నారు.

ఇక కోఛైర్సన్ గా పెతే శ్వేత ఉండన్నారు. సభ్యులుగా ఎల్గూరి దీప్తి, క్రాప విద్య, అర్చన కపూర్ వ్యవహరించనున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ వివరాలకు www.ataconference.org ని సందర్శించాలని సూచించారు. ఆటా ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో సేవ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని తెలుగు వారంతా కలుసుకోవడానికి ఆటా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+