NRI News: మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. గత ఏడాది క్లబ్‌లో కలిసిన మహిళపై అత్యాచారం చేసినందుకు భారత సంతతికి చెందిన విద్యార్థిని UKలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను UKలోని కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ప్రీత్ వికల్ కు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రీత్ వికల్ సౌత్ వేల్స్ లోని కార్ఢిఫ్ ప్రాంతంలో నివాస్తూ ఉండేవాడు. అతను గతేడాది జూన్ లో ఓ క్లబ్ కు వెళ్లాడు. అదే క్లబ్ కు ఓ మహిళా గ్రూప్ వచ్చింది. అందులోని ఓ మహిళతో వికల్ కు పరిచయం అయింది. అయితే సదరు మహిళ ఓళ్లు తెలియకండా తాగేసింది. పూర్తిగా మత్తులోకి వెళ్లిపోయింది. వికల్ కూడా మద్యం సేవించాడు. ఇద్దరు కలిసి మత్తులో క్లబ్ బయటకు వచ్చారు. వికల్ ఆ మహిళను కార్దిఫ్లోని తన ప్లాట్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

A court has sentenced a man of Indian origin to seven years in prison for raping a drunk woman

"బాధితురాలు అతిగా తాగింది. నిస్సహాయంగా మత్తులో ఉంది. ఆమె క్లబ్ వెలుపల అడుగుపెట్టి ప్రీత్ వికల్‌ను కలిసింది. ఇద్దరూ సంభాషణలో నిమగ్నమై వారి సమూహాల నుంచి దూరంగా వెళ్లారు" అని అధికారులు తెలిపారు. ప్రీత్ వికల్ మహిళను తన చేతులు పట్టుకుని తీసుకెళ్లాడు. తర్వాత తన భుజాల మీదుగా తీసుకువెళ్లాడు. ఇందుకు సంభందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అందులో 20 ఏళ్ల యువకుడు మహిళను కార్డిఫ్ రోడ్ల గుండా తన ఫ్లాట్‌కి తీసుకెళ్లడం చూడవచ్చు.

మహిళను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత, ప్రీత్ ఆమె "ట్రోఫీ ఫోటో" తీసి అతని స్నేహితులకు పంపినట్లు తెలిసింది. ఏం జరిగిందనే విషయాన్ని సదరు మహిళ ధైర్యంగా అధికారులకు తెలిపింది. అతని చర్యల వల్ల వణుకుపుట్టిందని, నిద్రపోలేక పోయానని, అపరాధ భావాన్ని అనుభవించానని ఆమె వివరించినట్లు పోలీసులు వివరించారు.

అయితే కార్డిఫ్ లో మహిళలపై ఇలాండి దాడులు జరగడం అరుదని పోలీసులు తెలిపారు. కానీ ప్రీత్ వికల్ వంటి వ్యక్తుల ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పారు. అతను ప్రణాళిక ప్రకారం సదరు మహిళపై అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+