NRI News: అరబ్ కుటుంబం చేతిలో చిత్రహింసలు.. స్వదేశం రావడానికి మహిళ అవస్థలు..
హైదరాబాద్ కు చెందిన సకీనా ఫాతిమా అనే మహిళ సౌదీ అరేబియాలో ఆమె పని చేస్తున్న యజమాని చేతిలో చిత్రహింసలకు గురైంది. గత నవంబర్ లో ఆమె అక్కడి నుంచి బయటకొచ్చింది. అప్పటి నుంచి ఫాతిమా సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. స్వదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెను స్వదేశానికి రప్పించే ప్రక్రియ వేగవంతం చేయాలని మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ విదేశాంగ మంత్రి జైశంకర్ ను అభర్యర్థించింది.
గత ఏడాది నవంబర్‌లో సకీనా సోదరుడు సయ్యద్ జాకర్ హుస్సేన్ ఆమెను రక్షించాలని విజ్ఞప్తి చేస్తూ విదేశీ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు. భర్త చనిపోవడంతో కుటుంబాన్ని చూసుకునేందుకు ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన సకీనా ఓ ఏజెంట్ ను కలిసిందని లేఖలో వివరించారు. దుబాయ్‌లో ఇంటి పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పినట్లు లేఖలో పేర్కొన్నాడు.

ఏజెంట్ మూడు నెలల విజిట్ వీసాకు హామీ ఇచ్చాడని.. ఆమెకు ఉద్యోగం నచ్చితే, ఆమె వీసా రెండేళ్లకు పొడిగిస్తామని చెప్పప్పినట్లు తెలిపారు. అయితే మూడు నెలలు గడిచినా జీతం ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావాలని కోరింది.
Sakina Fatima who was in search of job after death of her husband was taken to Dubai on a visit visa with a promise that she can return if she doest like to work but was sold to a Shaik family in Saudi and was not allowed to come back when her mother was serious who later died/2 pic.twitter.com/hJBDn2jCQh
— Majlis Bachao Tehreek (MBT) (@MBTparty) November 17, 2022
కానీ వెనక్కి పంపే బదులు, సకీనాను సౌదీ అరేబియాలోని అరబ్ కుటుంబానికి విక్రయించాడు ఏజెంట్. ఆమె రోజూ 18 గంటలపాటు జీతం లేకుండా పని చేసింది. ఆమె తల్లి చనిపోయిన తర్వాత కూడా ఆమెను ఇండియాకు తిరిగి పంపించలేదు. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న సంబంధిత అధికారులు ఆమెను రక్షించి సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయానికి తరలించారు. నవంబర్ నుంచి సకీనా ఎంబసీలో ఉంటూ స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తోంది.
.@DrSJaishankar Sir, Its been four months that Sakina Fatima has been rescued and staying in @IndianEmbRiyadh since then, Kindly ask the concerned to speed up the matter and repatriate her.
— Majlis Bachao Tehreek (MBT) (@MBTparty) March 25, 2023
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications