సూడాన్లో ఆర్మీ వర్సెస్ పారా మిలటరీ ఘర్షణలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో సుడాన్ అల్లర్లతో అట్టుడుకుతుంది. పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. దీంతో భారతీయులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటి నుండి బయటకు రావద్దని ఇండియన్ ఎంబసీ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది.
సుడాన్ లో ఉన్న భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, పలు ప్రాంతాలలో కాల్పులు ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బయటకు వెళ్ళవద్దని సూచించింది. అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తామని, తాము ఇచ్చిన అప్డేట్స్ ఆధారంగా ప్రవర్తించాలని సుడాన్ లోని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండాలని సూచించింది.

ఇదిలా ఉంటే సుడాన్ లోని పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని, సైన్యం లో విలీనం చేయడానికి రూపొందించిన ప్రతిపాదనే ప్రస్తుతం ఘర్షణలకు కారణంగా మారింది. అయితే ఈ ప్రతిపాదన ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలిటరీ కమాండర్ మహమ్మద్ హందాస్ డగ్లో మధ్య చోటు చేసుకున్న వివాదం కొద్ది రోజులుగా తీవ్రస్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలోనే సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాలలో ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాలు పరిష్కారం దాడులకు దిగడంతో సుడాన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే వీరి మధ్య జరుగుతున్న ఘర్షణలో భాగంగా సూడాన్ అధ్యక్ష భవనాన్ని, సైన్యాదినేత బుర్హాన్ నివాసాన్ని, ఖార్టూమ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.
దీంతో ఈ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నట్టు తాజా పరిణామాలతో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications