వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో దసరా ఉత్సవాలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జులై వారాంతంలో జాతీయస్థాయి సమావేశం, యువజన సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆటా సభ్యులు, నిర్వహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఆటా ఆధ్వర్యంలో అక్కడి తెలుగు ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా ఈ పండగ జరుపుకుంటారని చెప్పారు. అక్టోబర్ 20న న్యూజెర్సీలో నిర్వహించిన ఉత్సవాల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 700మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ATA celebrates Dasara

దుర్గా పూజతో ప్రారంభమైన ఉత్సవాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. పూజ అనంతరం జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. న్యూజెర్సీలోని కూచిపూడి కళాశాలలో ఇందిరా శ్రీరాం దీక్షిత్ వద్ద శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆటా ప్రాంతీయ కో-ఆర్డినేటర్ రఘువీర్ రెడ్డి అతిథులందర్నీ ఆహ్వానించారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం వారాంతంలో మూడు రోజుల మెగా కార్యక్రమాన్ని ఫిలడెల్ఫియాలో నిర్వహించాలని నిర్ణయించారు.

పూజారి వేలమూరి దసరా ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రజలకు వివరించారు. విజయం పొందాలనే ప్రతీ కార్యక్రమాన్ని దసరా రోజునే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తన సందేశాన్ని తెలియజేశారు. 13వ ఆటా కన్ఫరెన్స్ కన్వీనర్ పరమేశ్ భీంరెడ్డి వచ్చే ఏడాదిలో చేపట్టబోయే మెగా కార్యక్రమం గురించి సభ్యులకు వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తొందరగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని ప్రసాంధ్రులను కోరారు.

ఆటా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు. చికాగో, డల్లాస్, అట్లాంట, వాషింగ్టన్ మొదలైన సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. మీడియా సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆటా నాయకులు సుధాకర్ పెర్కారి హాజరైన ప్రవాసాంధ్రులకు అభినందనలు తెలిపిన అనంతరం శాసనసభ్యుడు ఉపేంద్ర చివుకులను పరిచయం చేశారు.

అంజనా సౌమ్య, దీపు, రేలారే రవి, వంశీ ప్రియ పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమానికి తానా, నాట్స్ నాయకులు హాజరయ్యారు. ఆటా వ్యవస్థాపక సభ్యుడు హేమంత్ రెడ్డి, భువనేశ్ బూజల, కృష్ణ ద్యాప, బల్వంత్ కొమ్మిడి, అనంత్ పజ్జుర్, నరేందర్ చెమర్ల, వినోద్ కొందూరు, రామ్మోహన్ కొండా, సతీష్ రెడ్డి, పురుషోత్తం పిన్నపురెడ్డి, సురేష్ జిల్లా, లక్ష్మణ్ అనుగు, నాట్స్ నాయకులు మధు కొర్రపాటి, గంగాధర్ రావు దేసు, మోహన్ మన్నవ, టిఏజిడివి అధ్యక్షుడు రవి పొట్లూరి పాల్గొన్నారు.

పరమేశ్ భీంరెడ్డి, రఘువీర్ రెడ్డి, వేణు సంకినేని, భగవాన్ పింగ్లే, ధీరజ్ ఆకుల, శ్రీకాంత్ గోడపూటి, మహి సన్నపరెడ్డి, నారాయణ పిర్లమర్ల, ఇందిరా దీక్షిత్, రమేష్ మాగంటి, ప్రదీప్ సువర్ణ, రవి పెద్ది, రవి పట్లోల, శ్రీనివాస్ దార్గుల, విజయ్ కొండూరు, రాజ్ చిలుముల, వెంకట్రాం వేములారం, శ్రీనివాస్ రణబోతు, కిశోర్ భూపతిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

English summary
The American Telugu Association, a nonprofit organization serving the community in the United States since its inception in the early 1990s, is holding a national meeting and youth convention in Philadelphia next year during the July 4 weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X