NRI News: చిన్నారి కలశకు డాక్టరేట్ ప్రదానం..
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా చిన్నారి గుర్తింపు పొందారు. ఆమె కలశ ఫౌండేషన్ తో ఎంత సేవ చేశారు. కలశ పసితనము నుంచే ఇతరుల కష్టాలు చూసి స్పందించే వారు. తన వంతుగా సాయం చేస్తూ వస్తోంది. పేద పిల్లలకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు ఇచ్చేద. చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు.
కలఖ ఫౌండేషన్ కు చేయూతను అందించారు.'అక్షర కలశం' అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది ఈ ఫౌండేషన్. ఈ చిన్నారి విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ 'మార్వలెస్ ఉమెన్' పురస్కారాలతో సత్కరిస్తుంది. 'గ్రీన్ రన్' పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం కృషి చేస్తోంది.

ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. చిన్నారి కలశ తన సేవలను విదేశాలకు విస్తరించాయి. ఆమెను ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు వరించాయి. తాజాగా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ కలశకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ 'ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు'గా అరుదైన గుర్తింపు పొందింది.
పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్, అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ మాట్లాడారు.
కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం చేశారు.












Click it and Unblock the Notifications