NRI News: అమెరికాలో బతుకమ్మ సంబురాలకు హాజరుకానున్న మేయర్ విజయలక్ష్మి..

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అమెరికాలోని క్యారీ నార్త్ కరోలినాలో అదివార బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. సెకండ్ వరల్డ్ ఫోరమ్ ఆన్ అర్బన్ ఫారెస్ట్ అండ్ ద ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 16 నుంచి 20 తేదీ వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డిసి లో జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి గారిని ఆహ్వానించారు. వారి ఆహ్వానంతో మేయర్ విజయలక్ష్మి అమెరికా వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరిత హారం పైన మేయర్ అక్కడ ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా క్యారీ నార్త్ కరోలినాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలలో పాల్గొంటారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన సంస్కృతికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రపంచంలో మనవారు ఏ మూలన ఉన్న బతుకమ్మ పండుగను సాంప్రదాయ బద్ధంగా జరుపు కుంటున్నామని గుర్తు చేశారు. దేవతలను పూవులతో పూజిస్తారు కానీ అదే పూలను పూజించే పండుగ మన బతుకమ్మ పండుగని కొనియాడారు. మన వారందరితో కలిసి బతుకమ్మ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

GHMC Mayor Vijayalakshmi will attend the Bathukamma celebrations in America

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. భారత్ జాగృతి యూకే యూనిట్ ఈసారి బతుకమ్మ పండుగను నిర్వహిస్తోంది. అక్టోబర్ 21న యూకేలో జరిగే ఈ బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను కొద్ది రోజుల క్రితం భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోన్నారు. భారత్ జాగృతి యూకే యూనిట్ ఏటా మెగా బతుకమ్మ ప్రోగ్రామ్‌ ను నిర్వహిస్తోంది.

ఈ సంవత్సరం కూడా యూకేలో జరిగే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఎన్నారైలు హాజరు కానున్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలు దేశాల్లో జరుపుకోబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించి తెలంగాణ వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+