లైంగిక వేధింపులు: ఆస్ట్రేలియాలో ఎన్నారై అరెస్ట్

సెప్టెంబర్ 7న పెర్త్‌లోని విక్టోరియా పార్క్ వద్ద తన ఐదుగురు స్నేహితులతోపాటు ఉన్న ఓ మహిళపై సునికుమార్ సహరన్(28) అనే టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదు మేరకు సునికుమార్‌పై పోలీసులు లైంగిక వేధింపుల అభియోగాలు నమోదు చేశారు. 457 వీసాపై సునికుమార్ సహరన్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని, అది ఇప్పుడు పని చేయడం లేదని పెర్త్ మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు.
457 వీసాపై నైపుణ్యం కలిగిన వారినే ఆస్ట్రేలియా అనుమతిస్తుందని, అది కూడా నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా, సునికుమార్ సహరన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. డిసెంబర్ 2న సునికుమార్ ఒక్క రోజు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications