బ్రిటన్‌లో సిక్కు వ్యక్తిపై అకారణంగా శ్వేతజాతీయుడి దాడి
లండన్: బ్రిటన్ పార్లమెంట్ వద్ద భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తిపై దాడి జరిగింది. ఓ శ్వేత జాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన ముప్పై ఏడేళ్ల రవ్‌ణీత్ సింగ్ పోర్ట్‌కుల్లిస్ హౌస్ వద్ద సిక్కు ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్‌ను కలిసేందుకు వచ్చారు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన శ్వేతజాతీయుడు... రవ్‌ణీత్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై దాడి చేసి టర్బన్‌ను లాగివేశాడు. ముస్లిం గో బ్యాక్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ దాడికి పాల్పడ్డాడు.
దీనిపై రవ్‌ణీత్ మాట్లాడుతూ.. పోర్ట్‌కుల్లిస్ హౌస్ ఎదుట క్యూలో నిలబడ్డానని, సదరు వ్యక్తి తన దగ్గరకు వచ్చి అకారణంగా గొడవ పడ్డాడని, తనపై దాడి చేసి తన టర్బన్‌ను గట్టిగా లాగేశాడని, అది కొద్దిగా ఊడిపోతుంటే తాను వెంటనే దానిని పట్టుకున్నానని, తాను గట్టిగా ఎదురు తిరిగి అరిచే సరికి అతడు పారిపోయాడని చెప్పారు.
జాత్యాంహకార మాటలు కొన్ని మాట్లాడాడని, ముస్లిం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాడని, అతడు శ్వేతజాతీయుడే కానీ, ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని, వేరే భాషలో మాట్లాడి పారిపోయాడని చెప్పారు. కాగా ఈ దాడిని ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు దాడిని ధ్రువీకరించారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications