ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్లగొండ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి(33) అనే టెక్కీ ఆస్ట్రేలియాలో మరణించాడు.

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న అతను ఉద్యోగ బాధ్యతల్లో భాగంంగా ఆరు నెలల కిందట సిడ్నీ కోన ఆదినారాయణ రెడ్డి సిడ్నీ వెళ్లాడు. కాగా, ఆదివారం సాయంత్రం మిర్యాలగూడలో ఉంటున్న భార్య శిరీషతో చివరిసారి ఆదినారాయణ మాట్లాడారు.

Infosys techie Adinarayana Reddy dead in Australia

ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా ప్రతిస్పందించలేదు. దాంతో అతను ఉంటున్న గదికి వెళ్లి చూడాలని మిత్రులను కుటుంబ సభ్యులు కోరారు. ఇంటికి వెళ్లిన మిత్రులకు ఆదినారాయణ శవమై కనిపించాడు.

భర్త మరణంతో భార్య శిరీష కన్నీరుమున్నీరవుతోంది. వారికి మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆదినారాయణ మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదినారాయణ రెడ్డి మరణానికి గల కారణాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Software engineer from Nalgonda disrict of Telangana Kpna Adinarayana Reddy died at Sydney in Austrlia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి