Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బహ్రెయిన్‌లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Bahrain: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 70వ జన్మదిన వేడుకలు బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్‌ సభ్యులంతా కేక్ కట్ చేసి కేసీర్‌కి హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్.. మేమంతా మీ వెంటే అంటూ నినదించారు.

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని బహ్రెయిన్ శివాలయం లో పూజలు చేసి కేసీఆర్‌కి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

 kcr birthday celebrations held in bahrain by BRS leaders

మాజీ ప్ర‌ధాని, తెలుగు తేజం పీవీ న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌తర‌త్న ప్ర‌క‌టించ‌డం తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించినందుకు కేంద్రానికి ఎన్నారై బీఆర్‌ఎస్‌ పక్షాన ధ‌న్య‌వాదాలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సతీష్ కుమార్ కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, వారు తొందరగా కోల్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణాకి శ్రీరామరక్ష అని, సందర్భం ఏదైనా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.

ఒకనాడు తెలంగాణ అంటే కరువు ప్రాంతం, వలసలకు నెలవు. ఒకనాడు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలకు వేదిక. ఇలా ఎన్నో సమస్యలు, కష్టాలు. ఏది చెప్పినా తెలంగాణనే గుర్తొచ్చేది. కానీ.. నేడు తెలంగాణ వేరు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతి పదేళ్లలో తెలంగాణ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయి. ప్రతీ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలబడేలా చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఒకనాడు ఓడగొట్టబడిన తెలంగాణను గెలిపించి ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడేలా చేశారు. అందుకే కేసీఆర్‌ తెలంగాణే నా కుటుంబం అనుకున్నారు. ప్రజలు బాగుంటేనే, తెలంగాణ బాగుంటుందని భావించారు. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారని ప్రశంసించారు.

ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ గత పది సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలని ఇందిరమ్మ రాజ్యం కావాలని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని లైనులో నిలబెట్టి గోసపెట్టడమే ప్రజాపాలన అంటూ ప్రజలను రోడ్డుపైన పడేస్తున్నారన్నారు.

ఇప్పుడుకేసీఆర్ చెప్పింది జరుగుతుంది కాంగ్రెస్ వస్తేకరెంటు పోతుంది, రైతుబంధు రాదు , సాగు నీరు ఉండదు అని వారి అనుభవంతో చెప్పారు. మీకు పాలనా చేయడం చేతకాక తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నాయకులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారమే లక్ష్యంగా అమలుచేయలేని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆరోపించారు.

 kcr birthday celebrations held in bahrain by BRS leaders

వాటికీ కావలసిన నిధులు తెలుసుకోకుండా బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు మొండి చెయ్యి చూపించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 70 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెపుతారన్నారు.

ఈ కార్యక్రమములో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య , మారం పల్లి తరుణ్ , తిప్పారవేణి శ్రీనివాస్, పల్లపు రవీందర్, బీఆర్ఎస్‌ నాయుకులు హాజరైన వారిలో వున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+