అమెరికాలో తెలుగువారి కోసం నూతనంగా ఆవిర్భవించిన ‘మాట’
హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు సేవలందించాలన్న సంకల్పంతో 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(MATA)' పేరిట కొత్త తెలుగు ఏర్పాటైంది. న్యూజెర్సీలో జరిగిన ఆవిర్భావ సభలో దాదాపు 2500 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 'మాట' వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల మాట్లాడారు. సేవ, సంస్కృతి, సమానత్వం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించామన్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, డల్లాస్, అట్లాంటా, షికాగో, హూస్టన్, డెట్రాయిట్ తదితర 20 నగరాల్లో మాట కమిటీలను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 2వేల మంది జీవితకాల సభ్యులుగా చేరారని చెప్పారు.

తానా, ఆట, నాట, నాట్స్ తదితర తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన అమెరికన్ తెలుగు అసోసియేషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ కోర్ కమిటీ సభ్యులు శ్రీధర్ చిల్లర, దాము గేదెల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ గాయని సునీత తన సహ గాయకుడు అనిరుధ్‌తో కలిసి నిర్వహించిన సంగీత కచేరి అలరించిందని నిర్వాహకులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications