ఆస్ట్రేలియాలో ఘనంగా కవిత పుట్టిన రోజు వేడుకలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
మెల్బోర్న్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు.
సంగీత రవిశంకర్ ధూపాటి ఆధ్వర్యంలో కవిత దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినయ్ సన్నీ ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ.. అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరచుకుందన్నారు.

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడంతోపాటు పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో తెలియజెప్పడానికి విశేష కృషి చేస్తుందని తెలిపారు. తమకు అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేంుకు చేస్తున్న కవిత కృషిని ఆయన కొనియడారు. కవిత జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సతీష్ పులిపాక, విక్రమ్ కందులతోపాటు వివిధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి నేతలు కవిత పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇతర దేశాల్లోని బీఆర్ఎస్, జాగృతి నేతలు కూడా కవిత పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు.












Click it and Unblock the Notifications