శాన్ ఫ్రాన్సిస్కో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ సంస్కృతిని ఖండాంతరాలు దాటించిన తెలంగాణ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫ్రిమోంట్ లో జరగబోయే బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3గం.ల నుంచి సాయంత్రం 7గం.ల వరకు రాయల్ ప్యాలెస్ వేదికగా ఈ మెగా బతుకమ్మ సంబరాలు మరియు దసరా పండుగ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ జాగృతి మరియు అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తెలిపింది.

 MP Kavitha going to participate in batukamma celebrations in california

ఈ బతుకమ్మ వేడుక కోసం కాలిఫోర్నియా నుంచే గాక చుట్టు పక్కల నగరాల నుంచి తెలుగువారు హాజరయ్యే అవకాశముంది. ప్రాంతం, కులం, మతం అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున జనం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఈ 14వ మగా బతుకమ్మ సంబరాలకు కూడా భారీగానే జనం తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. వేడుక అనంతరం విందు ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+