NRI News: ఖలిస్తాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రవాస భారతీయుల నిరసన..

ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికాలోని భారతీయలు నిరసన చేపట్టారు.కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ప్రాంగణం లో వందల మంది భారతీయ-అమెరికన్ మద్దతుదార్లు నిరసన తెలిపారు. మార్చి 24 శుక్రవారం సాయంత్రం 3 గంటలకు భారత్ కు అనుకుంగా నినాదాలు చేశారు. మార్చి 19న, 2023 ఆదివారం నాడు శాన్ ప్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేటు కార్యాలయ అద్దాలను ఖలిస్తాన్ అందోళకారులు ధ్వంసం చేశారు.

దానికి నిరసనగా ప్రవాస భారతీయులు భారత కాన్సులేట్ ఆఫీస్ బయట సమావేశమమ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. వందేమాతరం, భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. పలు దేశభక్తి పాటలు పాడారు. ప్రవాస భారతీయులు అక్కడి చేరుకోగానే ఖలిస్తాన్ వేర్పాటువాదులు నినాదాలు చేశారు. ప్రతిగా భారతీయులు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతా నినాదాలు, దేశభక్తి పాటలతో మారుమోగింది.

 NRIs protest in San Francisco, USA against Khalistan separatism on friday

అక్కడి చేరుకున్న పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశఆరు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నారు. మరో వైపు శాక్రమెంటో నగరంలో భారత, అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులు హాజరయ్యారు. రాఘువ్, మనహోర్, వెంకట్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్, కాన్సుల్ ఆకున్ సబర్వాల్ ను వారు కసిశారు.

ఆ శాంతి ర్యాలిలో పలువురు భారత అనుకూల ముస్లింలు, సిక్కులు, ఇతర ప్రవాసులు పాల్గొన్నారు. పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ అద్దాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు ధ్వంసం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+