14 ఏళ్లుగా సౌదీలో.. స్వదేశానికి తిరిగొస్తూ.. విమానంలోనే...
కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ఎడారి దేశానికెళ్లి.. అక్కడ 14 ఏళ్లపాటు పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో సొంతూరికి వస్తూ.. చివరికి విమాన
రియాద్: కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ఎడారి దేశానికెళ్లి.. అక్కడ 14 ఏళ్లపాటు పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో సొంతూరికి వస్తూ.. చివరికి విమాన ప్రయాణంలోనే కన్నుమూశాడు.
ఇదో భారతీయుడి విషాధగాథ. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ సలీమ్ (35) పధ్నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడ రియాద్ లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ తనతోపాటు తన సోదరుడిని కూడా సౌదీకి తీసుకెళ్లాడు.

అయితే కొన్ని నెలలక్రితం మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇక్కడ లాభం లేదనీ, భారత్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటే తగ్గుతుందని సౌదీ డాక్టర్లు వెల్లడించారు.
చెల్లెలి వివాహం కూడా దగ్గరపడటం, కొత్తగా నిర్మించిన ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమం కూడా ఉండటంతో.. అన్నింటికీ ఒకేసారి వెళ్లినట్లు ఉంటుందని భావించిన సలీమ్.. ఆరు నెలల సెలవు పెట్టి భారత్‌కు ప్రయాణమయ్యాడు.
బుధవారం సౌదీలోని రియాద్ నుంచి భారత్‌లోని కోజికోడ్‌కు వెళ్లే ఎయిరిండియా విమానం ఎక్కాడు. అయితే ఊహించని రీతిలో మధ్యాహ్నం 3.51 నిమిషాల సమయంలో అతడికి విమానంలోనే గుండెపోటు వచ్చింది.
తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, డాక్టర్ సాయం అవసరమని సలీమ్ విమాన సిబ్బందికి తెలిపాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా యూఏఈలోని అబూదాబిలో దించారు. వెంటనే విమానంలోని వైద్య సిబ్బంది... సలీమ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే అతడు ప్రాణాలు వదిలాడు.
మహమ్మద్ మరణించినట్లు అబూదాబీ డాక్టర్ల నుంచి మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు విమాన ప్రయాణాన్ని మరికొద్ది సేపు నిలిపివేశారు. అతడి మృతదేహాన్ని అక్కడి భారతీయ ఎంబసీ సంరక్షణలో ఉంచి.. 5.48 గంటల సమయంలో మళ్లీ విమానం బయలుదేరింది.
మరోవైపు మహమ్మద్ మరణ వార్తను విని సౌదీలోనే ఉండే అతడి సోదరుడు షాక్‌కు గురయ్యాడు. అతడితోపాటు ఉండే అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి.. డాక్టర్లతోనూ, స్వదేశంలోని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వెంటనే దుబాయికి వచ్చి.. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తామని అతడు వెల్లడించాడు.
మృతుడు మహ్మద్ సలీమ్ కు భార్య, మూడేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతూరికి వెళ్లి ఆరు నెలలపాటు హ్యాపీగా ఉందామని బయలుదేరిన మహమ్మద్‌కు ఇలా జరగడం బాధాకరమని విమానంలోని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications