'కేరళ ఈవెంట్లో అఫ్రిది హల్ చల్.. సిగ్గు లేదా అంటూ రెచ్చిపోయిన నెటిజెన్లు.. వీడియో వైరల్
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అటు భారత ఆర్మీ, కేంద్ర ప్రభుత్వంపై అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో దుబాయ్ లోని కేరళ కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అఫ్రిది రావడం తీవ్ర దుమారం రేపింది. దుబాయ్ లోని కేరళ కమ్యూనిటీ ఆయన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది అడ్డగోలుగా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్థాన్ పై ఆరోపణలు చేయడం తనను నిరాశ పరిచిందని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అయితే అఫ్రిది వ్యాఖ్యలకు భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్ లో జరిపిన విజయోత్సవ ర్యాలీలోనూ అఫ్రిది పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో అఫ్రిదిపై భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయన యూట్యూబ్ ఛానల్ ను నిషేధించింది.

అయితే తాజాగా దుబాయ్ లోని కేరళ కమ్యూనిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాహిద్ అఫ్రిది వచ్చాడు. ఆయన వెంట మరో క్రికెటర్ ఉమర్ గుల్ కూడా ఉన్నాడు. అయితే భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్రిదిని స్వాగతించడంపై వివాదం చెలరేగింది. అయితే పాకిస్థాన్ క్రికెటర్లు ఆహ్వానం లేకుండానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Kerala saar...wtff unbelievable pic.twitter.com/AbOq9U66ib
— Wellu (@Wellutwt) May 30, 2025
ఇక ఈ కార్యక్రమంలో అఫ్రిది వేదికపైకి రాగానే కింద ఉన్న వారు 'బూమ్ బూమ్' అని నినాదాలు చేశారు. అయితే.. దీనికి ప్రతిస్పందనగా అఫ్రిది 'హోగయా బూమ్ బూమ్'అని ప్రతిస్పందించాడు. తాను కేరళ ఫుడ్ కు పెద్ద అభిమాని అని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
అయితే ఈ కార్యక్రమంపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. భారత్ ను వ్యతిరేకించిన వాళ్లను ముఖ్య అతిథులుగా ఎలా పిలుస్తారని మండిపడుతున్నారు. కేరళ నిజంగా 100శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రమేనా అని నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications