‘బాహుబలి’, ‘కంచె’కు తానా అభినందనలు
న్యూయార్క్: జాతీయ అవార్డు గెలుచుకున్న 'బాహుబలి' చిత్ర బృందానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) తరపున డాక్టర్ వి చౌదరి జంపాల అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, అర్కా మీడియా వర్క్స్ సంస్థలకు అభినందనలు తెలియజేశారు.
సోమవారం ప్రకటించిన 63వ జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో బాహుబలి ఉత్తమ చిత్రం(స్వర్ణ కమలం అవార్డుకు)గా ఎంపికైన విషయం తెలిసిందే. అంతేగాక, మరో తెలుగు చిత్రం 'కంచె' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది.
ఈ సందర్భంగా బాహుబలి చిత్ర బృందంతోపాటు కంచె దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత వై రాజీవ్ రెడ్డిలకు చౌదర జంపాల అభినందనలు తెలియజేశారు.

దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, క్రిష్‌లు తెలుగు చిత్రాల స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. ఆ దర్శకుల దృష్టి, ప్రేరణ, అంకితభావమే వారికి ఈ గుర్తింపునిచ్చిందని తెలిపారు.
ఈ చిత్రాలు తెలుగు చిత్రసీమలో కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలకు అద్భుతమైన కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను ఈ సందర్భంగా చౌదరి జంపాల అభినందించారు. తెలుగు సినిమాకు దగ్గిన ఈ గుర్తింపుతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలు గర్వంగా భావిస్తున్నారని తెలిపారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications