వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిసిఏ ఆధ్వర్యంలో తెలంగాణ వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(టిసిఏ) ఆధ్వర్యంలో జూన్ 2న సన్నీవ్యాలీలోని ఉలవచారు రెస్టారెంటులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ తదితర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రవాసులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ చరిత్రను గుర్తు చేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్, ఇతర అమరవీరులుకు నివాళులర్పించారు. ఓం నలమాసు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ పోరాటాల గురించి వినయ్ మేరెడ్డి వివరించారు.

వేడుకలు

వేడుకలు

అమెరికాలోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(టిసిఏ) ఆధ్వర్యంలో జూన్ 2న సన్నీవ్యాలీలోని ఉలవచారు రెస్టారెంటులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వేడుకలు

వేడుకలు

ఈ కార్యక్రమానికి శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ తదితర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రవాసులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ చరిత్రను గుర్తు
చేసుకున్నారు.

వేడుకలు

వేడుకలు

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వేడుకలు

వేడుకలు

ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్, ఇతర అమరవీరులుకు నివాళులర్పించారు.

వేడుకలు

వేడుకలు

ఓం నలమాసు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ పోరాటాల గురించి వినయ్ మేరెడ్డి వివరించారు.

వేడుకలు

వేడుకలు

కాలిఫోర్నియా రాష్ట్ర కల్చరల్ ప్రతినిధి, ప్రముఖ గాయకుడు శ్రీనివాస మనప్రగడ ‘జయ జయ హే తెలంగాణ' గీతంతోపాటు పలు జానపద గీతాలు ఆలపించారు.

వేడుకలు

వేడుకలు

టిసిఏ ఎగ్జిక్యూటివ్ సభ్యుడ్ ఉదయ్ జొన్నల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతోపాటు పలు సంక్షేమ పథకాల వివరాలను సభలో వివరించారు. ఈ పథకాలకు తమవంతు సాయంగా 10వేల డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఎన్నారైలు ప్రభుత్వం అందించే పలు పథకాలకు తమవంతుగా సాయం చేయాలని విద్యావేత్త చుక్కా రామయ్య సూచించారు.

కాలిఫోర్నియా రాష్ట్ర కల్చరల్ ప్రతినిధి, ప్రముఖ గాయకుడు శ్రీనివాస మనప్రగడ ‘జయ జయ హే తెలంగాణ' గీతంతోపాటు పలు జానపద గీతాలు ఆలపించారు. టిసిఏ ఎగ్జిక్యూటివ్ సభ్యుడ్ ఉదయ్ జొన్నల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతోపాటు పలు సంక్షేమ పథకాల వివరాలను సభలో వివరించారు. ఈ పథకాలకు తమవంతు సాయంగా 10వేల డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

తెలంగాణ ఎన్నారైలు ప్రభుత్వం అందించే పలు పథకాలకు తమవంతుగా సాయం చేయాలని విద్యావేత్త చుక్కా రామయ్య సూచించారు. కాగా, ఈ కార్యక్రమానికి టాటా(తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) సహకారాన్ని అందించింది. టిసిఏ సభ్యులు రమేష్ తంగెళ్లపల్లి, అభిలాష్ రంగినేని, సుమణరావు, సంతోష్ కపార్తి, శ్రీనివాస్ పెరుమాండ్ల, తదితరులు కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.

ఈ కార్యక్రమాన్ని టిసిఏ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ చావ, ఛైర్మన్ మద్ది భాస్కర్, టిసిఏ మాజీ అధ్యక్షుడు బిక్షం పలబిండేల, టిసిఏ అధ్యక్షుడు చంద్రకళ శిరాందాస్, టిసిఏ ప్రధాన సలహాదారుడు ప్రసాద్ గట్టు, విజన్ తెలంగాణ అసోషన్ సభ్యుడు జగన్ బెరెల్లి, తదితరులు విజయవంతం చేశారు.

English summary
Telangana Cultural Association (TCA), an eleven year old Americancultural organization, celebrated Telangana Formation Day on 2nd Juneat Ulavacharu restaurant in Sunnyvale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X