తెలంగాణ ఎన్నారై ఫోరమ్ నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు..

Subscribe to Oneindia Telugu

బ్రిటన్: తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) 5సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఫోరమ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

2012 లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పని చేసి సంస్కృతి,సేవ,భాషాభివృద్ది లక్ష్యంగా తమవంతు బాధ్యతగా తెలంగాణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 2017లో చేనేతకు చేయూత కార్యక్రమం ద్వారా చేనేత వస్త్రాలను విదేశాల్లో మొట్ట మొదటి సారిగా భారీస్థాయి లో ప్రచారం చేసి మార్కెటింగ్ నిర్వహించి అనేక తెలంగాణ తెలుగు సంఘాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మాతృభూమి లో రైతుకు అండగా పేద విద్యార్థులకు ఆర్ధిక ఆసరాగా ,అమరవీరుల కుటుంబాలకు అండగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శిగా ఉన్నదీ , ఇక్కడ బ్రిటన్‌లో నివసిస్తున్న తెలంగాణ వారి కోసం ఎప్పుడు భారీ స్థాయిలో సంస్కృతి ప్రచారం లో భాగం గ బతుకమ్మ ,బోనాలు నిర్వహిస్తూ వస్తుంది , అలాగే దేశ సేవలో భాగంగా స్వతంత్ర దినోత్సవం ,అంబేడ్కర్, గాంధీ జి జయంతి వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తర్వాతి తరం వారికి దేశ భక్తిని నింపే చేస్తుంది .

telangana nri forum elected new committee

గత ఏడాది నిర్వహించిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ బతుకమ్మ కు 1500 మంది తెలంగాణ వారిని ఒక్క చోట కల్పిన ఘనత ఫోరమ్ దే.తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ నూతన కమిటీ ప్రెస్ ద్వారా తెలిపారు. సంస్థ కార్యాచరణ, కార్యక్రమాలు అన్ని కూడా నూతన వర్కింగ్ కమిటీ చేతనే జరుగుతాయని ,కమిటీకి పూర్తి బాధ్యత కు ఉంటాయని తెలిపారు.

నూతన కమిటీ అధ్యక్షులుగా సిక్కా చంద్ర శేఖర్ గౌడ్,ఉపాధ్యక్షులుగా గోలి తిరుపతి ,ప్రవీణ్ రెడ్డి లు
,అడ్వైజరి బోర్డు చైర్మన్‌గా ప్రమోద్ అంతటి, ప్రధాన కార్యదర్శులుగా కాసర్ల నగేష్ రెడ్డి ,రంగుల సుధాకర్ లు ,సంయుక్త కార్యదర్శులు గా భాస్కర్
పిట్ల ,సురేష్ గోపతి లు ,కోశాధి కారులు గా ,రంగు వెంకట్ ,మర్యాల నరేష్ లు వీరి తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా వివిధ నగరాలకు ఇంచార్జ్ లు గా దాదాపు 70 మంది తో కూడిన కమిటీ నిర్వహించింది .

బ్రిటన్ లో తెలుగు తెలంగాణ సంఘాల్లో మొట్ట మొదటి భారీ కార్యవర్గం ఇదే అని సంస్థ
తెలిపింది. చేనేత చేయూతతోపాటు ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఒక ఎన్ ఆర్ఐ కుటుంబం ఒక రైతు కుటుంబం దత్తత కార్యక్రమం చేబట్టి కార్యాచరణ రూపొందిస్తామని త్వరలో రైతు సహాయార్ధం ప్రణాళిక
రూపొందిస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Nri forum, Uk members elected a new committee on the occasion of completing 5years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి