Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ugadi Celebrations: యూకేలో ఘనంగా ఉగాది జరుపుకున్న తెలుగు ప్రజలు..

మన తెలుగు వారు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోరు. ఏ దేశంలో ఉన్నా మన తెలుగు పండగలను ఘనంగా జరుపుకుంటారు. యూకేలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఎడిన్ బర్గలో మార్చి 25న ఉగాది సంబురాలు చేసుకున్నారు. డాల్ కీత్ కమ్యూనిటీ హాల్ ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు వారు భారీగా హాజరయ్యారు. దాదాపు 300 మంది వేడుకల్లో పాల్గొన్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ కు చెందిన పర్రి విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూక నిరజంన్, సాంబ రాజశేఖర్ వేడుకలకు వచ్చేవారికి ఘనస్వాగతం పలికారు. ఉగాది వేడుకలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమం సా.6 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు, పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు, సినీ, సాంస్కృతిక సంగీతాలాపనలు, స్టాండ్-అప్ కామెడీతో తెలుగు వారు ఎంజాయ్ చేశారు.

Telugu Association of Scotland Celebrates ugadi festivel on 25th march

ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్‌ హాజరయ్యారు. మైథిలి కెంబూరి, శివ చింపిరి ఘనంగా సత్కరించారు. తెలుగు నేర్పించడం, సైకిల్ ప్రోగ్రామ్‌లు మీద TAS-UK చేస్తున్న కృషిని బిజయ్ కొనియాడారు. సితార్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. భాషా సంబంధిత కార్యకలాపాల ద్వారా తెలుగును బోధించడానికి, ప్రోత్సహించడానికి TAS-UK చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం కోర్సును పూర్తి చేసిన సిలికాన్ ఆంధ్ర మనబడి విద్యార్థులకు శ్రీమతి మాధవి లత ధృవపత్రాలను అందించారు.

ఇంత అత్యద్భుతంగా సాగిన ఈ కార్యక్రమానికి పండరి జైన్ కుమార్ ఈవెంట్ పబ్లిసిటీని చూసుకోగా, సాంస్కృతిక ప్రదర్శన సమన్వయంలో బాలాజీ కర్నాటి చూసుకున్నారు. నరేష్ డీకొండ, జాకీర్ షేక్, వెంకటేష్ గడ్డం లాజిస్టిక్స్ సమకూర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందిరకి ఉదయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+