Jaya Badiga: అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగ అరుదైన ఘనత
వాషింగ్టన్: ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలతో భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎన్నో కీలకమైన పదవులు, బాధ్యతలో కొనసాగుతున్నారు. తాజాగా, మరో తెలుగు మహిళ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగకు అరుదైన గౌరవం దక్కింది.
కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జీగా జయ బాదిగ నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమీషనర్‌గా జయ కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన జయ బాదిగ.. హైదరాబాద్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన జయ.. బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు.
ఆ తర్వాత 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు జయ. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. అంతేగాక, లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు జయ. మరోవైపు, మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను పని చేశారు. తాజాగా, కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జీగా జయ బాదిగ నియమితులవడం తెలుగువారికి గర్వకారణంగా చెప్పవచ్చు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications