వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటీష్ ఆర్మీ వేడుకల్లో ‘తెలంగాణం’

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటీష్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కొల్చేస్టర్ గారిసన్ ఇంటర్నేష్‌నల్ ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ కల్చరల్ ఫేర్'లో భారతదేశ సంస్కృతిని, అలాగే తెలంగాణా సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేసింది.

కల్చరల్ ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి రేకుల, మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ రెడ్డి, ఇవెంట్స్ కమిటీ సభ్యుడు వెంకట్ రెడ్డి దొంతుల, బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న తెలంగాణా బిడ్డ ప్రవీణ్ కుమార్ పెంట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో తెలంగాణా రాష్ట్ర పండగలు బతుకమ్మ, బోనాల ప్రత్యేకతను, తెలంగాణా
టూరిజం, తెలంగాణా ప్రత్యేక వంటకాలు వంటి అంశాలను ప్రదర్శించారు.

TENF programme in London

స్టాల్‌ను సందర్శించిన వివిధ హోదాల్లోని ఆర్మీ అధికారులు, సైనికులు తెలంగాణా ఎన్నారై ఫోరం సేవలను ప్రశంసించారు. భారతదేశాన్ని, ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రాన్ని తప్పక సందర్శించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

సంస్థ ప్రతినిథులు మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికల్లో పరిచయం చేయడానికి నేడు అవకాశం కలిపించిన ఆర్మీ అధికారులకు, తెలంగాణా ఆర్మీ సభ్యుడు ప్రవీణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తమ వంతు బాధ్యతగా తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికల్లో పరిచయం చేయడమే కాకుండా, పునర్నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.

English summary
TENF held a programme on Telangana culture in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X