Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage In Flight: విమానంలో పెళ్లి.. వైరల్ అయిన వీడియో..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక గొప్ప క్షణం. అందుకే ఈ పెళ్లిన అత్యంత ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. మిడిల్ క్లాస్ వారు అయితే తమకు ఉన్నంతలో పెళ్లి ప్లాన్ చేసుకుంటారు. ఇక సంపన్నలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా సంపన్న భారతీయులు ఇటలీ, ప్రాన్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అందిరి కన్నా డిఫరెంట్ గా పెళ్లి చేసుకుంది ఓ జంట. విమానంలో గాల్లో ఉండగా ఆ జంట ఒక్కటయింది.

UAEలో ఉన్న ఒక భారతీయ వ్యాపారవేత్త దిలీప్‌ పోప్లీ తన కుమార్తె వివాహాన్ని భిన్నంగా జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రైవేట్‌ జెటెక్స్‌ బోయింగ్‌ 747లో ఏర్పాట్లు చేశారు. వరుడు హృదేశ్‌ సైనాని పెళ్లి దుస్తులు ధరించి బ్యాండ్‌ బారాత్‌తో డాన్స్‌ చేస్తూ విమానం ఎక్కారు. అలాగే దాదాపు 300 మంది అతిథులు విమానం ఎక్కారు. వధూవరులు, అతిథులతో విమానం దుబాయ్‌ ప్రైవేట్‌ టెర్మినల్‌ నుంచి ఒమన్‌కు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఈ జంట వివాహంతో ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

The video of the wedding in the plane is going viral on social media

ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రముఖ హిందీ పాటకు కొంతమంది వ్యక్తులు నృత్యం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది."యూఏఇకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పాప్లీ నవంబర్ 24న దుబాయ్‌లో ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747 విమానంలో తన కుమార్తె వివాహాన్ని నిర్వహించాడు" అనే క్యాప్షన్‌తో పాటుగా X లో PTI వీడియోను పంచుకుంది.

మూడు గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో పెళ్లితో పాటు విందు కూడా పూర్తయింది. అతిథుల కోసం అద్భుతమైన విందు అందించారు. మానంలోని వారంతా వేడుకను వీక్షించేలా ప్రోజెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. వేడుక అనంతరం విమానం ఒమన్‌లో ల్యాండ్‌ అయింది. "నా కుమార్తె కోసం దీన్ని చేయాలని నేను ఎప్పుడూ కలలు కన్నాను. అన్ని కలలను నెరవేరుస్తున్నందున దుబాయ్‌ని మించిన ప్రదేశం మరొకటి లేదు" అని దిలీప్‌ పోప్లీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+