కాలిఫోర్నియాలో ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని శాన్ రామన్ లో వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 09తో ముగిశాయి. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు అందరిని ఆకట్టుకున్నాయి. చివరి రోజైనా అక్టోబర్ 9న బతుకమ్మ పాటలు, కనువిందు చేసే బతుకమ్మలతో తెలంగాణ ఎన్నారైలంతా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కోలాటం.. డ్యాన్స్
ఇందులో భాగంగా.. కోలాటం, డ్యాన్స్ లతో వేడుకలు ఉర్రూతలూగగా.. వేడుకల అనంతరం రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఆహుతులందరినీ ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి. తొలుత తెలంగాణ ఎంపీ, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

నిర్వాహకులు
కాగా, కార్యక్రమంలో పాల్గొన్న టీసీఏ ఎగ్జిక్యూటివ్ టీమ్ మాధవి అన్నం, ధనంజయ బోడ, వినోయ్ మేరెడ్డి, భాస్కర్ మద్ది, క్రిష్ణ గాండ్ర, చంద్రకళ శ్రీరామదాస్, అభిలాష్ రాగినేని, ఉదయ్ జొన్నాల, విజయ్ చవ్వ, భిక్షం పాలబిందెల, బుచ్చన్న గాజుల, మరియు టాటా ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్ అప్పిరెడ్డి అన్నపూర్ణ రెడ్డి మరియు ఝాన్సి రెడ్డి సహా తదితరుల సహాకారంతో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి.

బతుకమ్మలకు బహుమతులు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నవారంతా ఆటపాటలతో ఆనందోత్సాహాల నడుమ వేడుకలను జరుపుకున్నారు. అలాగే కనువిందు చేసిన బతుకమ్మలకు గాను కొన్ని బహుమతులను కూడా పంపిణీ చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications