మహానీయుడి పేరు పెట్టడం గర్వకారణం, టీఆర్ఎస్ బహ్రెయిన్ సెల్ హర్షం
తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ జనరల్ సెక్రటరీ మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ అభినందనలు తెలియజేశారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని ప్రతీ ఒక్కరినీ సమాన దృష్టితో చూసిన, దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును సచివాలయానికి పెట్టడం గొప్ప నిర్ణయం అన్నారు.

దీనిపై వారు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. ఇదే స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా నూతన పార్లమెంటు భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపనుండగా.. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ గురించి తర్వాత మాట్లాడుదాం.. ముందు కొత్తగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ స్పూర్తి లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేసీఆర్ కామెంట్ చేశారు. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్.. కేంద్రంపై పడనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications