విదేశీ విద్యకు స్కాలర్ షిప్: ఎంపీ కవితని కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధులు

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా/హైదరాబాద్: భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య మైత్రి కై అస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్బుల్ తో విచ్ఛేసిన ప్రతినిధి బృందం ఢిల్లి లో జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితని కలిశారు.

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యకై వచ్ఛే తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు కవిత గారు యూఎన్ఎస్‌డబ్ల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జాకబ్ తో కూడిన బృందంతో సమావేశమయ్యారు. ఈసమావేశం లో తెలంగాణలోని విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య పూర్తి చేసే ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది.

Trs nri cell met MP Kavita to discuss on scholarships

త్వరలోనే ఎంపీ కవిత సిడ్నీలో యూఎన్ఎస్‌డబ్ల్యూ అద్వర్యంలో జరిగే మలి సమావేశంలో  పాల్గొంటారని , ఈ సమావేశం సఫలం ఐతే తెలంగాణ విద్యార్థుల కల నెరవేరుతందని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు .

యూఎన్ఎస్‌డబ్ల్యూ బృందం కవిత ద్వారా తెలంగాణ లోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఆనందం వ్యక్తం చేసారని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు. ఎంపీ కవిత గారితో ఈ సమావేశానికి సహకరించిన తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, కిశోర్ బేండే, రాజేష్ రాపోలుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫ్. జాకబ్ తో కూడిన బృందం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trs Nri cell members met Nizamabad MP Kavita to discuss on student scholarships.
Please Wait while comments are loading...