NRI News: హైదరాబాద్ యువతితో సంబంధం.. ఊడిన యూకే యూనివర్సిటీ వీసీ పదవి..!
హైదరాబాద్ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ వైస్ ఛాన్సలర్ జేమ్స్ టూలీని సస్పెండ్ అయ్యారు. ఈ విషయం యూకేలోని ఓ యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మహిళ రాసిన డైరీలను ప్రొఫెసర్ టూలీ భార్య సింథియా యూనివర్సిటీకి అందజేయడంతో ఈ సంబంధం బయటపడింది. ఈ డైరీలలో హైదరాబాద్ యువతి 65 ఏళ్ల విద్యావేత్తతో లైంగిక సంబంధం కలిగి ఉందని పేర్కొంది.
అతను యువతి యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు చెల్లించడంలో సహాయం చేయడంతో వారి మధ్య పరిచయం ప్రారంభమైనట్లు తెలిసింది. యువతి తన డైరీలో టూలీని దయ, గౌరవప్రదంగా అభివర్ణించింది. ఆరోపణల నేపథ్యంలో విశ్వవిద్యాలయ నిర్వాహకులు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ కోల్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్రిస్ పేన్ ప్రో వైస్-ఛాన్సలర్ హ్యారియెట్ డన్‌బార్-మోరిస్‌లను తాత్కాలిక సహ-హెడ్‌లుగా నియమించారు.

ప్రొఫెసర్ టూలీ 2020 నుంచి వైస్-ఛాన్సలర్‌గా పనిచేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. హైదరాబాద్ యువతి 18 ఏళ్ల వయసులో యూకే యూనివర్సిటీ వీసీని మొదటిసారి కలిశారని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంబంధం శరీరిక సంబంధంగా మారిందని డైరీలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
సింథియా టూలీని 2022లో వివాహం చేసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జంట విడిపోయిన తర్వాత ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకువచ్చింది.












Click it and Unblock the Notifications