US News: భారతీయ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల హెచ్చరిక.. ట్రంప్ రాక ముందే..

Indian Students to US: నేటి యువతలో చాలా మందికి అమెరికా డ్రీమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి మాస్టర్స్ చేయాలని, ఆతర్వాత చిన్నగా అక్కడే స్థిరపడి నాలుగు డాలర్లు వెనకేసుకోవాలని చాలా మంది కోరిక. తమకు తెలిసినవాళ్లు, చుట్టాలు లేదా ఫ్రెండ్స్ గతంలో వెళ్లి బాగా సంపాదించి స్థిరపడ్డారని రోజూ వినే మాటలు చాలా మందిని ఈ మార్గం వైపు ప్రేరేపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కథ మెుత్తం మారిపోయింది.

జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం యూఎస్‍లో చదువుతున్న, పనిచేస్తున్న భారతీయ విద్యార్థులకు, నిపుణుల భవిష్యత్తుపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రతిష్టాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలు ప్రయాణ సలహాలను జారీ చేశాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణ నిషేధాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాల మధ్య విదేశీ విద్యార్థులు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందే యూఎస్‍కి తిరిగి రావాలని కోరుతున్నట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

Universities in US advising foreign students come back to America before Trump s Oath

జనవరిలో మధ్యలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఇమ్మిగ్రేషన్, ఆర్థిక విధానాలపై దృష్టి సారించి, తన మొదటి రోజు ముఖ్యమైన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసే ప్రణాళికల గురించి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2017లో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఏడు ముస్లిం దేశాలకు చెందిన జాతీయులపై అకస్మాత్తుగా ప్రయాణ ఆంక్షలు విధించినప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పూర్వ అనుభవం దృష్ట్యా.. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్, అమ్హెర్స్ట్ తమ అంతర్జాతీయ విద్యార్థులు, సిబ్బందిని జనవరి 20కి ముందే అమెరికాకు తిరిగి రావాలని సూచిస్తున్నాయి.

ఇదే క్రమంలో వెస్లియన్ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు సలహా ఇచ్చింది. దేశంలోకి తిరిగి ప్రవేశించడంలో ఇబ్బందిని నివారించడానికి సురక్షితమైన మార్గం జనవరి 19 నాటికి అమెరికాలో భౌతికంగా ఉండటమేనని వెల్లడించింది. పరిపాలన పరివర్తన చెందుతున్నప్పుడు విధాన మార్పుల అనూహ్యత కారణంగా అంతర్జాతీయ విద్యార్థులు తమ ప్రయాణ ప్రణాళికలను జాగ్రత్తగా అంచనా వేయాలని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డేవిడ్ ఎల్వెల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మార్పు వల్ల ఏర్పడే వీసా ప్రాసెసింగ్‌లో సంభావ్య జాప్యాలు, కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు అమల్లోకి వచ్చినప్పుడు అమెరికా బయట ఉన్నవారికి వచ్చే నష్టాలను హైలైట్ చేశారు.

ప్రస్తుతం అమెరికాలోని అనేక యూనివర్సిటీలు తమ అంతర్జాతీయ విద్యార్థులకు మద్ధతును ఇచ్చే ప్రయత్నంలో చర్యలను వేగవంతం చేశాయి. యేల్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి వెబ్‌నార్‌ కూడా నిర్వహించింది. ట్రంప్ పరిపాలనలో ఎదురయ్యే ఏవైనా విఘాతం కలిగించే మార్పులను ఎదుర్కోవడానికి అమెరికాలో ఉన్న సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక సలహాను జారీ చేయనప్పటికీ, అమెరికాలో కొనసాగుతున్న పరిస్థితిని గుర్తించింది. అలాగే అమెరికాలోని భారతీయ పౌరులను ప్రయాణ నిబంధనల గురించి తెలియజేయమని ప్రోత్సహిస్తోంది. 2023-2024 విద్యా సంవత్సరంలో చైనాను అధిగమించి ఇండియా విద్యార్థుల సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+