Aparna constructions: తెల్లాపూర్‌లో హైరైజ్ టవర్స్..మీ బడ్జెట్‌లోనే సొంతింటి కల..!
ఈ రోజుల్లో హైదరాబాదులో ఇళ్లు కొనాలంటే మామూలు విషయం కాదు.కొందరికైతే అది అందని ద్రాక్షాలానే నిలిచిపోతోంది. అయితే అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ మరియు రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో హైదరాబాదు పరిసరాల్లో చక్కటి గృహాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మీకు అందుబాటులో ఉండే ధరతోనే మీకలను సాకారం చేసుకోవచ్చు. అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ సంస్థ తాజాగా హైదరాబాదులో రెండు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. అపర్ణ న్యూలాండ్స్, అపర్ణ సరోవర్ టవర్స్ పేరుతో రూ.2425 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది.
తెల్లాపూర్, నల్లగండ్ల ప్రాంతాల్లో 2500 అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించనుంది. ఈ అపార్ట్‌మెంట్‌లు 1475 చదరపు అడుగు నుంచి 3700 చదరపు అడుగుల వరకు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేయాలన్న తపనతో అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తోంది.

2024లో ఐదు భారీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నట్లు ఆ అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ రాకేష్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా గేటెడ్ కమ్యూనిటీలు, ఫ్లాట్స్ పై ముందుగా ఫోకస్ చేసినట్లు వెల్లడించారు.తెల్లాపూర్‌లో దాదాపుగా 14 ఎకరాల్లో విస్తరించిన అపర్ణ న్యూలాండ్స్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంది. ఇందులో ఎనిమిది హైరైజ్ టవర్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక్కో టవర్‌లో 42 ఫ్లోర్లతో మొత్తంగా 1976 ఫ్లాట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.ఇక 2.5 BHK, 3 BHK అపార్ట్‌మెంట్స్ ఇందులో ఉంటాయి. 1475 చదరపు అడుగులతో 2.5 BHK ఉండగా 1991 చదరపు అడుగులతో 3 BHK అందుబాటులోకి వస్తాయి.
ఈ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్న వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తోంది అపర్ణ కన్స్‌ట్రక్షన్స్. ఇక కూత వేటు దూరంలో ఐటీ కారిడార్, ప్రముఖ విద్యా సంస్థలు,హాస్పిటల్స్, కాలేజీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం నుంచి వీటన్నిటినీ చేరుకునేందుకు కేవలం అరగంట సమయం మాత్రమే పడుతుంది. ఇక ఈ ప్రాజెక్టులో 80శాతం ఏరియా ఓపెన్ స్పేస్ ఉంటుంది. రెసిడెంట్స్‌కు మంచి అనుభూతి కల్పించేందుకు ఇలా ప్లాన్ చేసింది సంస్థ.ఈ బహిరంగ ప్రదేశంలో వివిధ రకాల గార్డెన్స్, రిలాక్స్ అయ్యేందుకు క్లబ్ హౌజ్, వాతావరణ నియంత్రణ కలిగిఉన్న స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఇతర ఎమినిటీస్ కూడా ఉన్నాయి. RERA రిజిస్ట్రేషన్ నెంబర్:PO1100007480
తెల్లాపూర్‌లోని అపర్ణ న్యూలాండ్స్ నుంచి రెండు ఎంట్రెన్స్‌లున్నాయి. ఉస్మాన్ నగర్/ ఔటర్ రింగ్ రోడ్ (వెస్ట్) కనెక్ట్ చేస్తూ 100 ఫీట్ రోడ్, గోపనపల్లిని కనెక్ట్ చేస్తూ తూర్పు దిక్కుకు 60 ఫీట్ రోడ్ ఉన్నాయి.
ఇక 10 నిమిషాల నుంచి 25 నిమిషాలలోగా చేరుకునేలా అక్ష హాస్పిటల్, సిటిజెన్ హాస్పిటల్, స్టార్ హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, సిటిజెన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. రెండు నిమిషాల నుంచి 15 నిమిషాలలోపు చేరుకునేలా యూరోకిడ్స్ ప్రీ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్, సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, గ్రీన్ గాబల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, విస్తా ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండేల్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఉన్నాయి.సెయింట్ గ్జేవియర్స్ పీజీ కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు కూడా ఉన్నాయి.
అపర్ణా న్యూలాండ్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విమానాశ్రయం చేరుకునేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఇక క్యూ సిటీ, విప్రో సర్కిల్ రోడ్‌కు 15 నిమిషాలు గచ్చిబౌలికి 20 నిమిషాలు పడుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు 18 నిమిషాలు, విప్రో క్యాంపస్ -2కు 18 నిమిషాలు, రైతు నేత్రం సూపర్ మార్కెట్‌కు 12 నిమిషాలు, రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు 14 నిమిషాలు, డీ మార్ట్ సూపర్ మార్కెట్‌కు 14 నిమిషాల సమయం పడుతుంది.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications