ఆన్లైన్ పర్సనల్ లోన్:తక్షణ నిధులు పొందుటకు ఒక సులభమైన మార్గము
జీవితములో అనేక ఆశ్చర్యాలు ఉంటాయి - ఒక విహార యాత్ర ప్రణాళిక చేయడము వంటి కొన్ని ఆహ్లాదకరమైనవిగా ఉంటాయి, మరి కొన్ని ఊహించని ఖర్చుల రూపములో వస్తాయి. రెండు పరిస్థితులలో, నిధులు తక్షణమే అందుబాటులో ఉండడం చాలా పెద్ద వ్యత్యాసము తీసుకొని రావచ్చు. ఇటువంటి పరిస్థితులలోనే, ఎలాంటి సుదీర్ఘ పేపర్ వర్క్ లేదా అంతులేని నిరీక్షణ సమస్యలు లేకుండా తక్షణమే ఆర్ధిక సహకారం అందించే ఆన్లైన్ పర్సనల్ లోన్ రంగములోకి వస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ వంటి విశ్వసనీయమైన ఆర్ధిక భాగస్వాములకు ధన్యవాదములు, ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం అనేది ఆన్లైన్ లో షాపింగ్ చేయడమంత సులభమైనది. మీ అర్హతను పరీక్షించడం నుండి మీ ఖాతాలోకి నేరుగా నిధులను పొందడం వరకు, దరఖాస్తు ప్రక్రియ 100% డిజిటల్ అయినది మరియు సరళమైనది.

ఆన్లైన్ పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి?
ఒక ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈరోజులలో డబ్బు అప్పుగా తీసుకునేందుకు ఉన్న విధానాలలో అత్యంత సౌకర్యవంతమైనది. సంప్రదాయిక పద్ధతుల మాదిరిగా కాకుండా, మీరు ఎక్కువసార్లు బ్రాంచ్ ను సందర్శించవలసిన పనిలేదు లేదా సుదీర్ఘమైన ఆమోదాలలో వ్యవహరించవలసిన పనిలేదు. కేవలం మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ తో మీరు కొన్ని నిమిషాలలోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇది సరైన ఎంపికగా చేసే కొన్ని ప్రయోజనాలు ఇవ్వబడ్డాయి:
• త్వరిత ఆమోదము మరియు పంపిణి: బజాజ్ ఫైనాన్స్ తో కలుపుకొని, చాలామంది ఋణదాతలు కేవలం కొన్ని నిమిషాలలోనే ఆమోదం అందిస్తాయి మరియు 24 గంటలలో వేగంగా నిధులు పంపిణీ చేస్తాయి*.
• కొల్లాటరల్ అవసరం లేదు: మీరు మీ ఆస్తిని తనఖా పెట్టవలసిన పనిలేదు. దీనితో ఇది వేతన ఉద్యోగులకు మరియు స్వయం-ఉపాధి పొందిన వారికి ఒకే విధంగా అందుబాటులో ఉంటుంది.
• అనువైన వినియోగము: మీరు ఒక పెళ్ళి చేయాలని అనుకుంటున్నా, మీ ఇంటిని పునర్నిర్మించాలని అనుకుంటున్నా లేదా వైద్య బిల్లులు చెల్లించాలనుకున్నా, మీరు ఈ నిధులను ఏ అవసరం కోసమైనా ఉపయోగించుకోవచ్చు.
• సులభమైన డాక్యుమెంటేషన్: ప్రాథమిక కేవైసి వివరాలు, ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి ఈ ప్రక్రియను ప్రారంభించుటకు సరిపోతాయి.
పర్సనల్ లోన్ కొరకు ఈఎంఐ కాలిక్యులేటర్ పాత్ర
దరఖాస్తు చేసే ముందు ఉపయోగించవలసిన అత్యంత తెలివైన సాధనాలలో ఒకటి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్. ఈ ఆన్లైన్ సాధనము మీ నెలవారి తిరిగిచెల్లింపు మొత్తన్ని ముందుగానే లెక్కించుకునేందుకు సహాయపడుతుంది. మీరు చేయవలసినదంతా మూడు వివరాలు ఎంటర్ చేయాలి:
• ఋణ మొత్తము
• కాలపరిమితి
• ఋణదాత అందించే వడ్డీ రేటు
ఈ కాలిక్యులేటర్ మీకు ఈఎంఐ, చెల్లించవలసిన మొత్తం వడ్డీ మరియు ఋణము తీసుకోవటానికి అయ్యే మొత్తం ఖర్చులను వెంటనే చూపిస్తుంది. ఈ విధంగా, మీ నెలవారి వాయిదాలను సౌకర్యవంతంగా ఉండేలా చూసుకొనుటకు ఋణ మొత్తము లేదా కాలపరిమితిని సరిచేసుకోవచ్చు.
మీరు మీ ఫైనాన్స్ లను మెరుగ్గా ప్రణాళిక చేసుకోవచ్చు మరియు మీ బడ్జెట్ లో సరిపోయే తిరిగిచెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు కాబట్టి ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన అది తరువాత కలిగే ఆశ్చర్యాలను కూడా నివారిస్తుంది.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఫీచర్స్
డిజిటల్ లెండింగ్ విషయానికి వస్తే అత్యంత విశ్వసనీయమైన పేర్లలో బజాజ్ ఫైనాన్స్ ఒకటి. చాలామంది ఋణగ్రహీతలు ఎందుకు తమ ఆన్లైన్ పర్సనల్ లోన్ కు ప్రాధాన్యత ఇస్తారు అనేదానికి కారణాలు:
• రూ. 55 లక్షల వరకు ఋణ మొత్తము: పెద్ద మరియు చిన్న అవసరాలు రెండిటికి తగినది.
• అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి: 12 నెలల నుండి 96 నెలల కాలపరిమితుల నుండి ఎంచుకోండి.
• ముందుగా-ఆమోదించబడిన ఆఫర్లు: ఒకవేళ మీరు ప్రస్తుతం ఉన్న వినియోగదారుడు అయితే, మీరు తక్షణ ఆమోదముతో ప్రత్యేక ఆఫర్లు అందుకోవచ్చు.
• 100% ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: సుదీర్ఘ డాక్యుమెంటేషన్ లేకుండా, కేవలం మొబైల్ నంబరు మరియు ఓటిపి ఉపయోగించి దరఖాస్తు చేయండి.
• పారదర్శకత: బజాజ్ ఫైనాన్స్ 100% పారదర్శకతను నిలిపి ఉంచుతుంది మరియు పర్సనల్ లోన్స్ పై ఎలాంటి దాగి ఉన్న చార్జీలు విధించదు. మరింత తెలుసుకోవడం కోసం నియమాలు మరియు నిబంధనలను చదవండి.
బజాజ్ ఫైనాన్స్ తో ఆన్లైన్ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయుటకు దశలు
ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం చాలా సుళువు మరియు కేవలం కొద్ది నిమిషాల సమయం పడుతుంది:
◦ బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ ను సందర్శించండి.
◦ పేజ్ పైభాగములో ఉన్న 'దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి
◦ మీ ఫోన్ నంబరు ఎంటర్ చేయమని మరియు దానిని పరీక్షించుటకు ఒక ఓటిపి ఎంటర్ చేయాలని మిమ్మల్ని అడుగుతారు
◦ మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూరించండి
◦ ఇప్పుడు, ఋణము ఎంపిక పేజిని సందర్శించుటకు 'కొనసాగించు' పై క్లిక్ చేయండి.
◦ మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మా పర్సనల్ లోన్ రకాల నుండి ఎంపిక చేయండి.
◦ తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంపికచేయండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే కాలపరిమితి ఎంపికల నుండి ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగించు' పై క్లిక్ చేయండి.
◦ మీ కేవైసి ని పూర్తి చేయండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి.
తదుపరి దశల గురించి మా ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు. మీ దస్తావేజులు విజయవంతంగా ధృవీకరించబడిన తరువాత ఋణ మొత్తము మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మీ పర్సనల్ లోన్ ను నిర్వహించుటకు సూచనలు
బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవడం వలన మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా పర్సనల్ లోన్ ప్రయోజనాలను ఆనందించవచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి:
• మీకు కావలసిన మొత్తము మాత్రమే అప్పుగా తీసుకోండి: అవసరం లేకపోతే పెద్ద మొత్తము ఋణము కోసం ప్రలోభానికి గురికాకండి.
• కాలిక్యులేటర్ సహాయముతో మీ ఈఎంఐలను ప్రణాళిక చేసుకోండి: ఎప్పుడు మీ నెలవారి వాయిదా మీ బడ్జెట్ లో ఉందని నిర్ధారించుకోండి.
• సరైన సమయానికి చెల్లించండి: సమయానికి తిరిగిచెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది, తద్వారా భవిష్యత్తులో ఋణము తీసుకోవడం సులభం అవుతుంది.
• ఋణ మొత్తాన్ని తెలివిగా ఉపయోగించుకోండి: ప్రయాణము, వైద్య ఖర్చులు, విద్య లేదా ఇంటి పునర్నిర్మాణము వంటి ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి.
అంతిమ ఆలోచనలు
ఒక ఆన్లైన్ పర్సనల్ లోన్ కేవలం ఒక ఆర్ధిక ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది జీవితాన్ని సరళంగా చేయటానికి రూపొందించబడిన పరిష్కారము. బజాజ్ ఫైనాన్స్ తో, మీకు నిధులు వేగంగా అందడమే కాకుండా, మీరు అనుకూలత, పారదర్శకత మరియు మీ తిరిగిచెల్లింపుల పై పూర్తి నియంత్రణను కూడా పొందుతారు.
కాబట్టి, అది కలలు కన్న విహారయాత్ర, అకస్మాత్ ఖర్చు లేదా ముఖ్యమైన మైలురాయి ఏదైనా, మీ ప్రణాళికలు వేచి ఉండవలసిన పనిలేదు. ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి, ముందుగానే మీ ఈఎంఐలను లెక్కించండి మరియు ఋణము తీసుకొనుటకు తెలివైన విధానాన్ని ఎంచుకోండి.
*నియమాలు మరియు నిబంధనలు వర్తిస్తాయి
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications