Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏవియేషన్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో డిగ్రీతో పుష్కలంగా ఉద్యోగాలు..!

ఏవియేషన్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో బీబీఏ

ఏవియేషన్ మరియు టూరిజం మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అత్యంత గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది.విమాన ప్రయాణం, టూరిజంలకు డిమాండ్ ఏర్పడటంతో ఏవియేషన్ మరియు టూరిజం ఇండస్ట్రీ భవిష్యత్తులో గొప్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు ముందుగా ఉన్నాయి.ఈ రంగంలో మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనే వ్యక్తులకు మంచి అవకాశాలను అందిస్తోంది.

ఈ రోజుల్లో విమాన ప్రయాణం అనేది అందరికీ అందుబాటులో ఉంది.ఈ క్రమంలోనే ఏవియేషన్ ఇండస్ట్రీకి నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఏర్పడింది.ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తుల కోసం ఎదురుచూస్తోంది.

Pursuing BBA in aviation and tourism management helps to build career in aviation and tourism sector

భారత పౌర విమానాయాన శాఖ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాయాన రంగంలో మూడవ స్థానంలో ఉంది. భారత విమానాయాన రంగంలో 6.2 మిలియన్ ఉద్యోగావకాశాలు అందిస్తోంది.రానున్న 4-5 సంవత్సరాల్లో 80 కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. మరో 1000 కొత్త విమానాలు వచ్చి చేరనున్నాయి.దీంతో ఈ ఇండస్ట్రీలో కచ్చితంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

ఏవియేషన్ మరియు టూరిజం మేనేజ్‌మెంట్‌లో BBA ఎందుకు ఎంచుకోవాలి?

* ఇండస్ట్రీలో బూమ్: ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ మరియు టూరిజం ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది

* విస్తారమైన కెరీర్ ఆప్షన్లు: ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు. ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, ఏర్పోర్ట్ మేనేజ్‌మెంట్,టూర్ ఆపరేషన్స్, ట్రావెల్ ఏజెన్సీలతో పాటు మరిన్ని రంగాల్లో కెరీర్‌ నిర్మించుకోవచ్చు.

* నైపుణ్యత కలిగిన నిపుణులకు భారీ డిమాండ్: ఏవియేషన్ టూరిజం ఇండస్ట్రీలో బిజినెస్ పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నైపుణ్యత కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది.ఈ క్రమంలోనే మేము అందించే ప్రోగ్రాం ఇండస్ట్రీ డిమాండ్స్‌కు అనుగుణంగా ఉంటుంది. నైపుణ్యతతో పాటు ఇండస్ట్రీపై అవగాహన కల్పిస్తాం.

* గ్లోబల్ ఎక్స్‌పోజర్: ఏవియేషన్ మరియు టూరిజం ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ, ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పని చేయడానికి మరియు ప్రయాణించడానికి అవకాశాలను అందిస్తుంది.

* పారిశ్రామిక అవకాశాలు: మా ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు సొంతంగా ఏవియేషన్ టూరిజం ఇండస్ట్రీలో బిజినెస్ ఏర్పాటు చేసుకునేలా తీర్చి దిద్దుతాం.

కెరీర్ ఫీల్డ్స్ మరియు ఎందులో ఉద్యోగాలు

* ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్: కస్టమర్ సర్వీస్, ఫ్లయిట్ ఆపరేషన్స్ మరియు మెయిన్‌టెనెన్స్

* ఏర్పోర్ట్ మేనేజ్‌మెంట్ : ఏర్పోర్ట్ సెక్యూరిటీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ప్యాసింజర్ సర్వీసు లాంటి ఏర్పోర్ట్ ఆపరేషన్స్

* టూర్ ఆపరేషన్స్: ఒక వ్యక్తికి లేదా ఒక బృందం పర్యటనకు వెళ్తే వాటిని సక్రమంగా నిర్వహించడం. ఇందులో రవాణా, ఆతిథ్యంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇస్తాం

*ట్రావెల్ ఏజెన్సీస్: ట్రావెల్ అరేంజ్‌మెంట్స్‌ అంటే ఫ్లయిట్స్ , హోటల్స్, అద్దెకు కార్లు లాంటివి బుక్ చేసుకోవడంలో క్లయింట్స్‌కు సహాయం చేయడం

*హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్: హోటల్స్, రిసార్ట్స్, ఇతర పర్యాటక ప్రాంతాల్లో కస్టమర్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం

గుర్తింపు పొందిన రిక్రూటర్లు

ఇండిగో, ఎయిర్‌ఇండియా ఆకాసా ఎయిర్, ఐబీఎస్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, సెలెబి ఎన్ఏఎస్ ఏర్పోర్ట్ సర్వీసెస్, విస్తారా, ఏఐఎస్ఏటీఎస్,ఎయిర్ అరేబియా, ఎతిహాద్, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్

వేతనం : ప్రారంభ వార్షఇక వేతనం రూ.3.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు

లాజిస్టిక్ట్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ

లాజిస్టిక్స్‌లో బీబీఏ ఎందుకు ఎంచుకోవాలి..?

లాజిస్టిక్స్ ప్రోగ్రాంలో బీబీఏ ఎందుకు చదవాలో కొన్ని కారణాలున్నాయి.

* లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్: లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది.దీంతో నైపుణ్యత కలిగిన నిపుణుల అవసరం పెరిగింది. ప్రపంచ దేశాలకు సరకు రవాణాలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని వాటిని విజయవంతంగా పరిష్కరించాలి.ఇది పెను సవాలుతో కూడినది కాబట్టి దీనికి డిమాండ్ బాగా ఉంది.

* విస్తారమైన ఉద్యోగావకాశాలు: ఈ ప్రోగ్రాం పూర్తి చేస్తే విస్తారమైన ఉద్యోగావకాశాలు మీ ముందుంటాయి. ఇవన్నీ వివిధ ఇండస్ట్రీలో అంటే రవాణా, రీటెయిల్, ఉత్పత్తి, ఈ-కామర్స్‌తో పాటు మరిన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయి

* హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్: ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థికి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పై పనిచేసే అవకాశం కలుగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ ఎలా ఉంటుందనే దానిపై అవగాహన రావడంతో పాటు ఇంటర్న్‌షిప్స్ ద్వారా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది.

*కెరీర్ అడ్వాన్స్‌మెంట్: ఈ డిగ్రీ పూర్తి చేయడం ద్వారా నైపుణ్యత, జ్ఞానం, సబ్జెక్ట్ పై పట్టు సాధించి ఈ రంగంలో ముందుకు దూసుకెళ్లేలా సిద్ధపరుస్తుంది.ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్‌గా అయినా సరే లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌ అయినా సరే నిన్ను ముందస్తుగా సిద్ధం చేస్తుంది.

Pursuing BBA in aviation and tourism management helps to build career in aviation and tourism sector

కెరీర్ ఫీల్డ్ మరియు జాబ్ పొజిషన్స్:

లాజిస్టిక్స్‌లో బీబీఏ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ రంగాల్లో ఉద్యోగవకాశాలు మెండుగా ఉన్నాయి.

* లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్: లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, వేర్‌హౌస్ సూపర్‌వైజర్, సప్లయ్ చైన్ అనలిస్ట్, ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్

* ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్: ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్, పర్చేసింగ్ ఏజెంట్,స్ట్రాటెజిక్ సోర్సింగ్ అనలిస్ట్

* సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్: సప్లయ్ చైన్ కోఆర్డినేటర్, ఆపరేషన్స్ అనలిస్ట్, ఇన్వెంటరీ కంట్రోల్ స్పెషలిస్టు

* ఈ- కామర్స్ లాజిస్టిక్స్: ఈ-కామర్స్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్, ఫుల్‌ఫిల్‌మెంట్ కోఆర్డినేటర్, లాజిస్టిక్ అనలిస్ట్

* కన్సల్టింగ్: సప్లయ్ చైన్ కన్సల్టెంట్, లాజిస్టిక్స్ కన్సల్టెంట్, ఆపరేషన్స్ ఇంప్రూవ్‌మెంట్ కన్సల్టెంట్

గుర్తింపు పొందిన రిక్రూటర్లు:

ఆరామాక్స్, ఈ కార్ట్, ఫెడెక్స్, డీహెచ్‌ఎల్, ఎక్స్‌ప్రెస్‌బీస్, ఐథింక్ లాజిస్టిక్స్, గటీ, టీసీఐ, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, మేర్స్‌క్,4టీగో, ఎడ్జెస్టిఫై

వేతనం: ప్రారంభ వార్షిక వేతనం రూ.3.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది

లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ

ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోంది. ఇందుకు కారణం అడ్వాన్స్ టెక్నాలజీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తయారు చేసే ప్రక్రియలో భాగంగా వారికి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. MH కాక్‌పిట్ విద్యార్థులకు ప్రత్యేకమైన మరియు విలువైన అభ్యాస అవకాశాన్ని అందిస్తుంది, అది వారికి జాబ్ మార్కెట్‌లో పోటీతత్వాన్ని అందిస్తుంది.

లాజిస్టిక్ మరియు సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ప్రోగ్రాం ఎంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి..?

* అధిక డిమాండ్: లాజిస్టిక్స్ మరియు సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌‌లో ఎంబీఏ చేసిన వారికి రీటెయిల్, ఉత్పత్తి, హెల్త్ కేర్, ఈ-కామర్స్ రంగాల్లో పుష్కలమైన ఉద్యోగావకాశాలున్నాయి.

* పోటీలో ముందుంటారు: ఎంబీఏ చేయడం వల్ల విద్యార్థులు తమ మేధోశక్తిని వినియోగించి సప్లయ్ చైన్స్‌లో ఎదురయ్యే సవాళ్లను తమ నైపుణ్యంతో ఇట్టే పరిష్కారం చూపగలరు. దీంతో మార్కెట్‌లో ఉన్న పోటీప్రపంచంలో వీరు అందరికంటే ముందుగా ఉండే అవకాశం ఉంది

* అడ్వాన్స్‌ టెక్నాలజీ: టెక్నాలజీ,ఆటోమేషన్,డిజిటలైజేషన్‌లు అడ్వాన్స్‌మెంట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఎంబీఏ చేసిన విద్యార్థులు ఈ రంగాల్లో ముందుండే అవకాశం ఉంటుంది.అంతేకాదు సప్లయ్ చైన్‌లో కొత్త టెక్నాలజీని ఎలా అమలు చేయాలన్న ముందస్తు అవగాహన ఉంటుంది.

* గ్లోబల్ దృక్పథం: LSCMలోని MBA ప్రోగ్రామ్ విద్యార్థులకు ప్రపంచ దృష్టికోణాన్ని అందిస్తుంది, అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి,వివిధ ప్రాంతాలలో కాంటాక్ట్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి వారికి సహాయపడుతుంది.

* నాయకత్వ నైపుణ్యాలు: ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రాజెక్ట్‌లలో ముందుండి నాయకత్వం వహించేందుకు, బృందాలలో పని చేయడానికి మరియు విభిన్న పాత్రలలో విలువైన నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశాలను కల్పిస్తుంది.

లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేసిన వారికి ఉద్యోగావకాశాలు :

* లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్: లాజిస్టిక్స్ మేనేజర్, వేర్‌హౌజ్ మేనేజర్, ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ సప్లయ్ చైన్ అనలిస్ట్

* ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్: ఈ రంగంలో సోర్సింగ్, చర్చలు, బిజినెస్ నిర్వహణకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొనుగోళ్లలో ఉంటాయి. ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్, పర్చేసింగ్ మేనేజర్, స్ట్రాటజిక్ సోర్సింగ్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి

* సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్: సప్లయ్ చైన్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగాలు

* ఈ-కామర్స్ లాజిస్టిక్స్: ఈ-కామర్స్ ఆపరేషన్స్ మేనేజర్, ఫుల్‌ఫిల్‌మెంట్ మేనేజర్, లాజిస్టిక్స్ అనలిస్ట్

* కన్సల్టింగ్: సప్లయ్ చైన్ కన్సల్టెంట్, లాజిస్టిక్స్ కన్సల్టెంట్, ఆపరేషన్స్ ఇంప్రూవ్‌మెంట్ కన్సల్టెంట్

*ఇంటర్నేషనల్ ట్రేడ్: ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ మేనేజర్, ఇంటర్నేషనల్ ట్రేడ్ కంప్లయన్స్ మేనేజర్, ఇంపోర్ట్/ఎక్స్‌పోర్ట్ కోఆర్డినేటర్

ఏవియేషన్ ఎలక్టివ్‌గా ఎంబీఏ హెచ్‌ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్:

ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతి ఏటా వృద్ధిని నమోదు చేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. వార్షిక వృద్ధి 24శాతంగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.భారత్‌లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో 350 విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.దీంతో ఏవియేషన్ రంగంలో మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఏవియేషన్ ఇండస్ట్రీలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేస్తే కెరీర్‌లో మంచి అవకాశాలుంటాయి. ఈ కోర్సు ద్వారా విద్యార్థుల్లో ఏవియేషన్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏవియేషన్ రంగంలో నలభై ఏళ్ల పాటు చేసిన పరిశోధన అనుభవాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. అంతేకాదు ఏవియేషన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం తీసుకున్న విద్యార్థులు వివిధ ఏర్పోర్ట్/ఎయిర్‌లైన్ సంస్థల సీఈఓలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

గుర్తింపు పొందిన రిక్రూటర్లు:

డెలాయిట్,ఎయిర్‌బస్ గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దస్సాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, లుఫ్తాన్స టెక్‌నిక్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెగ్గిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కాలిన్స్ ఏరోస్పేస్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఆదానీ ఎయిర్‌పోర్ట్స్, కంటెయినర్ కార్పోరేషన్, ఏజిస్ లాజిస్టిక్స్, షాడో ఫాక్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.

* వేతనం: వార్షిక వేతనం ప్రారంభం రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయండి: 7305076122/7305426230. ఇక్కడ క్లిక్ చేయండి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+