నాపై లైంగిక దాడి: యాదగిరిపై ఓ యువకుడి ఫిర్యాదు

వివరాలు ఇలా ఉన్నాయి - నీవన్ కుమార్ 2004లో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేరడానికి హైదరాబాదు వచ్చాడు. అతను విద్యానగర్‌లో ఉంటున్న సమయంలో మిత్రుల ద్వారా యాదగిరి పరిచమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో వారిద్దరు తరుచుగా యాదగిరి ఇంట్లో మద్యం సేవించడం పరిపాటిగా మారింది.
అలా మద్యం సేవించిన సమయంలో ఓసారి యాదగిరి రావు తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని, అదంతా యాదగిరి నివాసంలో సిసిటివీ కెమెరాలకు ఎక్కిందని, వ్యతిరేకిస్తే వీడియో ఫుటేజీని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి 2008 వరకు తనపై లైంగికంగా వాడుకున్నాడని నవీన్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నవీన్ విశాఖపట్నం వెళ్లిపోయాడు. యాదగిరి అరెస్టయ్యాడని తెలుసుకుని అతను హైదరాబాదు వచ్చాడు. యాదిగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదిలా వుంటే, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మరొకరిని అరెస్టు చేసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్‌కు చెందిన రవి సూర్యప్రకాశ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎసిబి అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయించడంలో సూర్యప్రకాశ్ బాబు కూడా ఓ చేయి వేసినట్లు ఎసిబి అధికారులు నిర్ధారించుకున్నారు. డీల్‌ను కుదర్చడంలో యాదగిరి ఫలితం సాదించగా, సూర్యప్రకాశ్ బాబు విఫలమయ్యాడు.












Click it and Unblock the Notifications