పెళ్లి చేసుకుంటానని మహిళపై రేప్: కానిస్టేబుల్ అరెస్ట్
నోయిడా: వివాహం చేసుకుంటానని ఓ మహిళలను శరీరకంగా అనుభవించి మోసం చేసిన పోలీస్ కానిబుల్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నోయిడాలోని సెక్టార్ 49లో విధులు నిర్వహిస్తున్న అతన్ని పోలీసులు జైలుకు తరలించారు. వివాహం చేసుకుంటానని చెప్పి నిందితుడు వివాహ తేదీని ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ వచ్చాడు. దీంతో బాధిత మహిళ అతన్ని నిలదీయడంతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని ఆమెను నిందిత కానిస్టేబుల్ బెదిరింపులకు గురి చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఖోడా గ్రామానికి చెందిన బాధిత మహిళకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త గత కొంత కాలం క్రితం మృతి చెందాడు. కాగా, ఓ వివాహానికి హాజరైన బాధిత మహిళకు నిందితుడు అమర్పాల్ ఛౌధరి పరిచయమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి దగ్గరయ్యారు. వివాహం చేసుకుంటానని చెప్పి అమర్పాల్.. ఆమెను లొంగదీసుకుని శరీరకంగా అనుభవించాడు.

నిందితుడు అమర్పాల్‌కు కూడా ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఈ విషయాన్ని బాధిత మహిళకు ఎప్పుడూ చెప్పలేదు. వివాహం ఎప్పుడు చేసుకుంటావని బాధితురాలు ప్రశ్నించినప్పుడల్లా వాయిదా వేసుకుంటూ వచ్చాడు నిందితుడు.
వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో నిందితుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతేగాక తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. దీంతో బాధిత మహిళ గురువారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శుక్రవాం అతన్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications