అనంతపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్..సందడి చేసిన అనసూయ..!!

South India Shopping Mall:అనంతపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ అభిమాన కస్టమర్ల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణమైన షాపింగ్ అవసరాలను తీర్చే దిశగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వైవిధ్య భరిత వస్త్ర శ్రేణిని, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతిని అందించే ప్రయత్నంలో సరికొత్త షోరూంను జూలై 12వ తేదీన ప్రారంభించారు.

సౌత్ఇండియా షాపింగ్ మాల్ తన 35వ షోరూంను అనంతపురంలో ప్రారంభించింది. అనంతపురం లోక్‌సభ సభ్యులు అంబికా జి. లక్ష్మీనారాయణ వాల్మీకీ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చేతుల మీదుగా ఈ నూతన షోరూం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో సంస్థ అధినేతలు పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళిలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

Anantapur Welcomes South India Shopping Mall s 35th Store Grand Opening with Anasuya

ఇక వీరితో పాటు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, నటి యాంకర్ అనసూయ భరద్వాజ్‌లు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక షోరూంలో బారులు తీరిన వైవిద్యభరితమైన వస్త్రశ్రేణి సందర్శించి కలెక్షన్ పై ప్రశంసించారు. రాయలసీమకే తలమానికంగా అనంతపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 35వ షోరూం నిలుస్తుందని, అన్ని తరాల వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నట్లు నిధి అగర్వాల్ చెప్పారు. సౌతిండియా షాపింగ్ మాల్ అందిస్తోన్న ఆఫర్లను వినియోగించుకోవాలని నిధి అగర్వాల్ స్థానికులకు పిలుపునిచ్చారు.

Anantapur Welcomes South India Shopping Mall s 35th Store Grand Opening with Anasuya

నాణ్యతకు, వెరైటీలకు పెట్టింది పేరు సౌతిండియా షాపింగ్ మాల్ అని అనసూయ చెప్పారు. తనకు ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌తో చిరకాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎన్నో సార్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసినట్లు చెప్పిన అనసూయ, ఇక్కడ షాపింగ్ చేయడం ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. స్టోర్‌లో ప్రతిసారి అడుగుపెట్టినప్పుడల్లా తనకు కనిపించే ట్రెండీవేర్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు.

Anantapur Welcomes South India Shopping Mall s 35th Store Grand Opening with Anasuya

ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్స్ సురేష్ శీర్ణ, అభినయ్, రాకేష్ కేశవ్ మాట్లాడుతూ వచ్చిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ఎన్నో రకాల కలెక్షన్స్ ఉన్నాయని అన్ని వయసుల వారి అభిరుచులకు తగ్గట్టుగా వస్త్రశ్రేణి ఉందని పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ నాణ్యత విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పిన డైరెక్టర్ సురేష్, అంకిత భావంతో కృషి చేయడం, పోటీ ధరలతో వస్త్రాభరణాలను అందించడంలో ముందుండటం తమ సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ రకాల పండుగలు, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన ఆషాఢమాసం ఆఫర్లను అందింనున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+