LULU Mall:హైదరాబాద్‌లోని లులూ మాల్‌లో ప్రధాన బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్..!!
300కి పైగా బ్రాండ్‌ల నుండి విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఫ్లాట్ 50% తగ్గింపును అందిస్తూ, హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న LuLu ఆన్ సేల్ తిరిగి వచ్చింది. జూలై 4 నుండి జూలై 7 వరకు కూకట్‌పల్లిలోని లులు మాల్, లులూ హైపర్‌మార్కెట్, లులూ కనెక్ట్ మరియు లులు ఫ్యాషన్ స్టోర్‌లో ఈ సేల్ జరగనుంది
ప్రీమియం బ్రాండ్‌లపై డిస్కౌంట్స్
ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా, ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్‌లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లు, గృహోపకరణాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులపై భారీ డిస్కౌంట్‌లను పొందొచ్చు. కొన్ని ప్రత్యేక బ్రాండ్‌లపై దాదాపుగా 50శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

లక్కీ డ్రా ద్వారా బహుమతులు
డిస్కౌంట్‌లతో పాటు వేలం పాట కూడా జరగనుంది. ఇందులో భాగంగా గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను వేలం వేయనున్నారు. ఈ వేలం పాటలో పాల్గొని మీకు నచ్చిన వస్తువును తీసుకెళ్లొచ్చు. ఇంకా ఈ మూడు రోజుల్లో లక్కీ డ్రా కూడా యాజమాన్యం నిర్వహిస్తోంది. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి వోచర్స్ ఇవ్వడం జరుగుతుంది. లులు స్టోర్‌లలో కొన్ని ఉత్తమ బ్రాండ్‌ల నుండి అద్భుతమైన బహుమతి వోచర్‌లను గెలుచుకునే అవకాశాన్ని కస్టమర్‌లు పొందుతారు.
ఆఫర్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులు
లులు మాల్‌లో ప్రీమియం బ్రాండ్‌ల శ్రేణి సేల్‌లో పాల్గొంటున్నందున, ఈవెంట్ గతంలో కంటే చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. లులు హైపర్‌మార్కెట్‌లో కిరాణా, కూరగాయలు, ఆహారం, బేకరీ వస్తువులపై గొప్ప ఆఫర్‌లను అందిస్తున్నారు. లులు ఫ్యాషన్ స్టోర్‌లో సగం ధరకే మంచి బ్రాండ్లను అందిస్తున్నారు. మరియు Lulu Connectలో గాడ్జెట్‌లు, టెలివిజన్‌లు మరియు గృహ ఎలక్ట్రానిక్స్‌పై కిల్లర్ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ సేల్ బ్రాండెడ్ దుస్తులు, ఫ్యాషన్ ఉపకరణాలు, బ్యాగులు, పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, గృహాలంకరణ వస్తువులు, బహుమతులు, ఆభరణాలు, గడియారాలు మరియు ఆహారాలపై కూడా ఉంది.

జూలై 21 వరకు షాపింగ్ బొనాంజా పొడిగింపు
ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఇప్పటికే ప్రధాన లులూ మాల్స్‌లో ప్రారంభమైంది. పలు ముఖ్యమైన బ్రాండ్‌లపై 50శాతం డిస్కౌంట్ లభిస్తోంది.ఇక ఈ షాపింగ్ బొనాంజా జూలై 21 వరకు కొనసాగుతుంది. ఇందుకు అదనంగా రాష్ట్రంలోనే అతిపెద్ద గేమింగ్ జోన్ అయిన Funtura కూడా గేమింగ్ ఔత్సాహికులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే లులూ మాల్‌కు చేరుకోండి ది బెస్ట్ డీల్స్‌ను పొందండి.












Click it and Unblock the Notifications