Lulu Mall: లులూ మాల్ తొలి వార్షికోత్సవం వేళ..పండగ ఆఫర్లు ఇవే..!!
హైదరాబాదులోని లులూ మాల్ ప్రారంభమై అప్పుడే ఏడాది పూర్తయ్యింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా లులూ మాల్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో తమ కస్టమర్లకు మంచి షాపింగ్ అనుభూతిని లులూమాల్ ఇచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నామని యాజమాన్యం తెలిపింది. రీటైల్ రంగంలో కస్టమర్ల విశ్వసనీయతను చూరుగొని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందించామని చెప్పేందుకు సంతోషిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
2023లో ప్రారంభమైన లులూ మాల్, కస్టమర్లకు విశిష్టత కలిగిన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలే అందిస్తూ ఎక్కడా రాజీ పడకుండా విలువలే ప్రధానంగా పాటిస్తూ లులూ మాల్ విజయపథంలో దూసుకెళుతోంది. లులూ మాల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా లులూ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రాఫ్ అలి ఎంఏ మాట్లాడారు. లులూ మాల్‌ను షాపింగ్‌కు చిరునామాగా మార్చిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

లులూ మాల్ రీజియనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు లులూ మాల్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. లులూ మాల్ విజయపథంలో దూసుకెళుతోందంటే ఇందుకు కారణం కస్టమర్లు, భాగస్వాములు, ఇక్కడి ఉద్యోగస్థులని వీరందరికి ధన్యవాదాలు తెలిపారు.ఏడాదిలోనే ఇంతటి ఘనమైన పురోగతి సాధించడంపై గర్వపడుతున్నట్లు చెప్పారు. వృద్ధి,నేర్చుకోవడం,సృజనాత్మకత ఈ మూడు అంశాలు ఈ ప్రయాణంలో అడుగడుగునా కనిపిస్తాయన్నారు.ఇక భవిష్యత్తులో కూడా ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు మంచి సేవలను అందిస్తామని అన్నారు.
హైదరాబాద్ లోని లులూ మాల్‌లో షాపింగ్ చేసేందుకు కోటిమందికిపైగా కస్టమర్లు ఆసక్తి చూపడం విశేషం.దాదాపుగా లక్షకు పైగా ఉత్పత్తులతో, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో కస్టమర్లకు చక్కటి షాపింగ్ అనుభూతిని ఇస్తున్న ఏకైక సంస్థగా లులూ మాల్ గుర్తింపుపొందింది.ఇక బెస్ట్ ఫుడ్ కోర్టు అవార్డు, బెస్ట్ ఫుడ్ కానైజర్ అవార్డు, బెస్ట్ హైపర్ మార్కెట్ అవార్డులను గెల్చుకున్న ఏకైక షాపింగ్ మాల్ లులూ మాల్. కేవలం అవార్డులకే పరిమితం కాలేదు లులూ మాల్, FSSAI నుంచి కూడా 5 స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్‌ను సైతం పొందింది.
తొలి వార్షికోత్సవం సందర్భంగ లులూ మాల్ రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తమ కస్టమర్లకు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను అందిస్తోంది.21 సెప్టెంబర్‌న ప్రారంభమైన ఈ ఆఫర్లు 31వ తేదీ అక్టోబరు వరకు కొనసాగుతుంది.అంతేకాదు షాపింగ్ చేసిన కస్టమర్లకు గ్రాండ్ ప్రైజెస్ కింద ఒక కారు బైకు ఇవ్వడం జరుగుతుంది.అంతేకాదు సెప్టెంబర్ 31వ తేదీ వరకు షాపింగ్ చేస్తున్న ప్రతి కస్టమర్లకు ప్రతి గంటకు ఒక బహుమతి ఇవ్వనుంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే లులూ మాల్ హైదరాబాద్‌కు విచ్చేయండి.












Click it and Unblock the Notifications