సంక్షేమ పథకాలు చిటికెలో అర్థం అయ్యేలా: వికసిత్ భారత్ పై Oneindia వినూత్న ప్రయోగం

దేశ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి, Oneindia 'వికసిత్ భారత్' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో అమలు అవుతోన్న అన్ని ప్రతిష్టాత్మక అభివృద్ధి పథకాల వెనుక ఉన్న లక్ష్యాలు, ప్రయోజనాలు మరింత సులభతరం చేయడం, మానవీయ కోణంలో ప్రజలకు చేరువ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి అధికారిక సమాచారాన్ని సులభంగా అందిస్తుంది.

దీనికి సంబంధించిన ఓ వీడియో రూపొందించింది.. Oneindia. ఇందులో- 'విక్షిత్ భారత్' సిరీస్‌లో విక్షిత్, భారత్ అనే రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి. నేటి యువ భారత ఆశయాలు, ఆసక్తిని ప్రతిబింబిస్తుంది వికసిత్ క్యారెక్టర్. అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని, దేశ సమైక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.. భారత్ అనే మరో పాత్ర. ఈ విలక్షణమైన పద్ధతిలో- ప్రతి జాతీయ సంక్షేమ పథకం వెనుక ఉన్న 'ఎందుకు' అనే ప్రశ్నను నిరంతరం అడుగుతుంటుంది వికసిత్ పాత్ర. చాచా- భతీజా మధ్య జరిగే సంభాషణ రూపంలో సాగుతుందీ వీడియో.

Oneindia Launches Viksit Bharat to Make India s Development Schemes Understandable

పథకాలను ప్రభుత్వ ఖర్చుగా చూడకుండా, వాటి వెనుక ఉన్న తర్కాన్ని, ఉద్దేశ్యాన్ని, అవి సృష్టించగల నిజమైన ప్రభావాన్ని ప్రశ్నిస్తుంటాడు వికసిత్. అనుభవం, సంస్థాగత జ్ఞాపకం, లోతైన జ్ఞానానికి ప్రతీకగా నిలిచే చాచా.. భారత్, ఈ విధానాల ప్రాథమిక లక్ష్యాలను వివరిస్తుంటాడు. అవి పౌరులను ఎలా బలోపేతం చేస్తాయి, అభివృద్ధిని ఎలా వేగవంతం చేస్తాయి, దీర్ఘకాలిక జాతీయ సామర్థ్యాన్ని ఎలా మారుస్తాయి వంటి అంశాలను వివరిస్తాడు.

ఉత్సుకత, స్పష్టత మధ్య నిరంతర సంభాషణ ఈ కథనానికి ప్రధాన చోదక శక్తిగా ఉంటుంది. వీరిరువురూ కలసి, ప్రధాన ప్రభుత్వ పథకాల 'ఎందుకు' 'ఎలా' అనే అంశాలను ప్రేక్షకులకు వివరిస్తారు. క్లిష్టమైన విధానాలను సులభంగా అర్థం అయ్యేలా, ప్రజల జీవితాలకు సంబంధం ఉన్నదిగా దీన్ని క్షున్నంగా క్రోడీకరిస్తారు. తద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

ప్రతి 'వికసిత్ భారత్' ఎపిసోడ్ లో ఓ పథకంపై ఈ చర్చ సాగుతుంది. ఆ పథకం పౌరులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది, దాని వాస్తవ ప్రపంచ అనువర్తనాలు ఏమిటి, దాని ఆర్థిక, జాతీయ ప్రాముఖ్యత ఏమిటి అనే మూడు కీలక అంశాలపై వివరణ ఉంటుంది. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించడానికి, అవగాహనను కల్పించడానికి రూపొందించిన వీడియో.

ఈ సిరీస్ Oneindia యూట్యూబ్ ఛానెల్‌, అలాగే Oneindia వెబ్‌సైట్‌లో విడుదలవుతుంది. Oneindia యూట్యూబ్ ఛానెల్ కు 21.8 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రాంతాలు, భాషలు, రీజియన్లు, రాష్ట్రాలు అనే తేడా లేకుండా ప్రజలందరి నుంచీ ఆదరణ పొందుతోందడానికి ఉదాహరణ. వికసిత్ భారత్' మొదటి దశలో ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్‌ను విడుదల అవుతుంది. మొదటి ఎపిసోడ్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

'వికసిత్ భారత్' ద్వారా, ప్రజలకు మరింత అధిక సమాచారాన్ని అందించాలనేదే Oneindia ముఖ్య ఉద్దేశం. పౌరులకు సాధికారత కల్పించడం, పౌర అక్షరాస్యతను మెరుగుపరచడం, దేశాభివృద్ధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోల రూపంలో అందిస్తుంది.

'వికసిత్ భారత్' ప్రారంభంపై Oneindia చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రావణన్ ఎన్ మాట్లాడారు. "ప్రతి భారతీయుడికి విశ్వసనీయమైన ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే మా లక్ష్యం. దీన్ని 'వికసిత్ భారత్' మరింత బలాన్ని చేకూరుస్తుంది. దేశాభివృద్ధికి సంబంధించిన కథనంలో పౌరులు స్పష్టత, అవగాహన, అవసరమైన జ్ఞానంతో పాలు పంచుకునేందుకు ఇది ఒక కీలకమైన ముందడుగు. విధానాలు ఎలా అవకాశాలుగా మారతాయో ఇది వివరిస్తుంది.." అని అన్నారు.

Oneindia ప్రభుత్వ సంబంధాల అధిపతి జగజ్యోతి పతి మాట్లాడుతూ "సంక్లిష్టమైన పథకాలను పౌరులు తమ రోజువారీ భాషలో స్పష్టమైన, నిర్మాణాత్మకంగా వివరించంలో 'వికసిత్ భారత్' ఓ ముందడుగు వేసింది. ఇది దేశాభివృద్ధి ప్రయాణంలో సమాచారంతో కూడిన భాగస్వామ్యాన్ని అందిస్తుంది. కీలకమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారిక, నిర్మాణాత్మక సమాచారాన్ని అందించడం ద్వారా, పౌరుల అవగాహనను బలోపేతం చేయాలనేదే మా లక్ష్యం.. అని అన్నారు.

మొదటి ఎపిసోడ్‌ను ఈ లింక్ ద్వారా చూడవచ్చు: https://youtube.com/shorts/Y06LFwlmoUE?si=vgnQu9nGPktcuFJ_

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+