కొన్ని ఒక్కట్లు

చితిలోంచి ఎగిరొచ్చిన కన్ను ఒక్కటే...
గాలికి ఎగురుతున్న చినుకులు
మట్టి గాజుల చెయ్యి చెలికిన గింజలు ఒక్కటే...
మెదడులో...తేలు
గండెలో...ఆమె...ఒక్కటే...
లచ్చువమ్మ చూపు నుంచి జారిన నవ్వు
శివుని గుడిలో జారిన పువ్వు...ఒక్కటే...
చిమ్మ చలికాలం చిక్కని ఎఁడ
నిద్రలో మెలుకువ వొడ్కా కాటు ఒక్కటే...
అలసిపోయి..
ఎగురుతూనే నిద్రపోయే పక్షి
దాన్ని వొడిసి పట్టాలనుకునే నా పాట...ఒక్కటే...












Click it and Unblock the Notifications